గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాజాగా చైర్మన్‌, ఎండీలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ లో పెట్టబడులు పెట్టి నష్టపోయామని ప్రజలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరరావు, ఆయన సోదరుడు కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసి, వారికి చెల్లించకుండా ఉన్న వీరిపై వందల కొద్ది కేసులు పడ్డాయి.

కేసు విచారణ చేపట్టిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు… అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు యత్నించింది. ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. హైకోర్టు కూడా ఆస్తుల వేలం పాట ను మోనిటర్ చేస్తోంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఈ కేసులో సీరియస్ గా లేకపోవడం హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో సిఐడి పోలీసులు అగ్రిగోల్డ్ యజమానులను అరెస్టు చేశారని అనుకోవాలి.

ఈ దరిమిలా కోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఊహించని విధంగా సంస్థ చైర్మన్, ఎండీలను అరెస్ట్ చేశారు. నేటి ఉదయం వీరిద్దరినీ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. సంస్థ చైర్మన్, ఎండీల అరెస్ట్ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు ఇకపై వేగం పుంజుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: