అధికారం లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో తనకి వీలైనంత మంది ఎమ్మెల్యే లని తెరాసలోకి ఆకర్షించడం లో కెసిఆర్ సఫలీకృతం అయ్యారు. ఇది వరకు చంద్రబాబు కి ఎదురుగా నిలిచిన ఏ నేతా చెయ్యలేని రేంజ్ లో ఇప్పుడు కెసిఆర్ చుక్కలు చూపిస్తున్నారు.  ఇన్నేళ్ళ తన రాజకీయ ప్రస్థానం లో చంద్రబాబు ఇంతగా కంగుతిన్న సందర్భాలు తక్కువ కాదు అసలు లేనే లేవు అని చెప్పాలి. నిన్న రాత్రికి రాత్రి మరొక ఎమ్మెల్యే రాజేందర్ తెరాస లోకి వెళ్ళిపోవడం కూడా తక్కువ రకం షాక్ ఏమీ కాదు.

 

 

అయితే ఎర్రబెల్లి ని కెసిఆర్ చాలా తెలివిగా తమ పార్టీలోకి తీసుకున్నారు అనేది విశ్లేషకుల వాదన. ఎర్రబెల్లి నుంచి ఇతర ఎమ్మెల్యేల విషయంలో కెసిఆర్ గేం ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. పాతికేళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రబెల్లి గత ముప్పై సంవత్సరాలలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే ఆయనకీ జనాల్లో ఉన్న పట్టు సంగతి ఊరికనే చెప్పచ్చు. ఇలాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి సొంత పార్టీ లో ఉంటే అంతకంటే టీడీపీ కి ఏం కావాలి.

 

 

వరంగల్ జిల్లాలో ఇప్పుడు తిరుగులేని పార్టీ గా తెరాస ఉద్భవించింది. జిల్లాకి చెందినా కడియం శ్రీహరి, కొండా సురేఖ ఇప్పుడు ఎర్రబెల్లి లాంటి వారు తమవైపు ఉండడం తో ప్రతిపక్షాలు అటు రావడానికి కూడా భయపడే పరిస్థితి. సొంతగా ఆలోచించి, సొంతగా వ్యవహరించే కడియం శ్రీహరి లాంటివారు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉండడం తో కెసిఆర్ ఎర్రబెల్లి తో చెక్ పెట్టాలని చూసారు. టీడీపీ ని నైతికంగా దెబ్బ తీసి తెలంగాణా లలో టీడీపీ కి అడ్రస్ లేకుండా చెయ్యాలి అనేది కెసిఆర్ ఆలోచన. టీడీపీ కి భవిష్యత్తు లేనే లేదు అని ప్రజలలో ఒక ఫీలింగ్ సృష్టించడం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: