కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద గ్రహణంలాగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేంద్రంలోని యూపీఏ సర్కారుకు మిత్రపక్షం కాకపోవచ్చు గాక.. అలాగని శత్రుపక్షమూ కాదనే సంగతిని వారు గుర్తించడం లేదు. కేటాయింపుల విషయంలో శత్రువులను డీల్‌ చేసినట్లుగా పక్షపాత ధోరణి చూపిస్తున్నారనే అపప్రధ వినిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో భాజపా తరఫున గెలిచిన ఒకే ఒక ఎంపీ కేంద్రంలో మన రాష్ట్ర అవసరాలను నివేదించి, సమస్యలను గట్టిగా తెలియజెప్పి కేటాయింపులు రాబట్టేంత సమర్థుడు కాదనే మాట కూడా జనంలో వినిపిస్తోంది. నిజానికి దత్తాత్రేయ కేంద్రరైల్వేమంత్రి సురేశ్‌ ప్రభు వద్ద చాలా పెద్ద వినతుల జాబితాను పెట్టారు. కానీ.. అందులో ఎంత మేరకు సాధించగలరనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా ఉంది. 


సికింద్రబాద్ రైల్వే స్టేషన్


దత్తన్న నివేదించిన తెలంగాణ అవసరాల జాబితా ఇలా ఉంది :


*  హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు వెంటనే విస్తరించాలి. దీనికోసం 200 కోట్లు కేటాయించాలి. 

*  దక్షిణ మధ్య రైల్వేకు మొత్తం 2500 కోట్లు కేటాయించాలి. 


*  ఎంతోకాలంగా పెండింగులో ఉన్న ఘటకేసర్‌- భువనగిరి , -యాదగిరిగుట్ట, లింగంపల్లి- శేరిలింగంపల్లి, అక్కన్నపేట- మెదక్‌, బొల్లారం-మనోహరాబాద్‌ ఎంఎంటీఎస్‌ల ప్రతిపాదనలు ఓకే చేయాలి. 


*  కాజీపేట కొత్త డివిజన్‌ మంజూరు చేయాలి. 


*  నగర పరిధిలో రెండు కొత్త టర్మినల్స్‌ ఏర్పాటుచేయాలి. మౌలాలి, లింగంపల్లిలో ఈ టర్మినల్స్‌ రావాలి. 

*  ఢిల్లీకి ఒక కొత్త బుల్లెట్‌ రైలు రావాలి 

*  హైదరాబాద్‌ టూ మధురై వయా తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ రైలు సర్వీసు రావాలి.. 
వంటి డిమాండ్లను దత్తన్న నివేదించారు. 


ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే దత్తాత్రేయ వాటిమీద ఎంత పట్టుగా కేంద్రరైల్వే మంత్రి మీద ఒత్తిడి తేగలరు. కోరుతున్న వాటిలో ఎన్నింటిని సాధించగలరు? అనేది చాలా కీలకాంశంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: