దేశాన్ని అట్టుడికిస్తున్న వ్యవహారం ' ఉగ్రవాదం ' ఇలాంటి విషయాల్లో స్వేచ్చ పేరుతో దేశ ద్రోహులైన ఉగ్రవాద నాయకులకే మద్దతు పలకడం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది ? భావ ప్రకటనా స్వేచ్చ అంటూ ఒక వంక పెట్టుకుని సగటు భారతీయుడిని భయపెట్టిన దేశ ద్రోహులకి జోహార్లు చెబుతూ సొంత దేశాన్నే కించ పరచడం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది. ఉరి శిక్షని వ్యతిరేకించడానికీ దేశ ద్రోహికి పడిన ఉరిశిక్ష ని వ్యతిరేకించడానికీ చాలా తేడా ఉంది. అనుకోని పరిస్థితి లో క్షణికావేశం లో ఉరిశిక్ష పడిన వారి మీద జాలి చూపించి వారిని సైకలాజికల్ గా బాగుచెయ్యాలి అనుకోవడం తప్పులేదేమో కానీ సంవత్సరాలకి సంవత్సరాలు దేశ సార్వ భౌమత్వానికి సవాల్ విసిరి దేశం లో మారణ హోమం సృష్టించే వారికి ఉరిశిక్ష పడితే దాన్ని ప్రశ్నించడం నూటికి నూరు పాళ్ళూ తప్పు పట్టాల్సిన విషయం.

 

 

 

 

పార్లమెంటు పైన దాడి చేసిన అఫ్జల్ గురూ కి సపోర్ట్ ఇస్తూ డిల్లీ జేఎన్యూ లో ఆందోళనలు మిన్ను ముట్టాయి. విద్యార్ధి నేతలు అరస్ట్ కి కూడా గురయ్యారు ఈ సందర్భం లో. వారు అఫ్జల్ గురూ లాంటి దేశ ద్రోహి కి సంతాప సభ జరిపి అతనికి జేజేలు కొడుతూ భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడం చాలా పెద్ద క్రైమ్ , అలా చేసినా వారిని ఏమీ అనకూడదట. ఈ దేశానికి ఒక పద్ధతి ఉంది, దేశం నాశనం చెయ్యాలి అనుకునేవారి పట్ల గట్టిగా ప్రవర్తించాలి అనేది ఆ పద్ధతి లో ఉంది అలా చెయ్యకపోతే దేశానికి తీవ్ర నష్టం.

 

 

చదువుకోవాల్సిన వారు అది ఆలోచించడం మానేసి మూర్ఖంగా ఒక టెర్రరిస్ట్ కంటే దారుణంగా ఆలోచించడం శోచనీయం. అసలు మనం ఉంటున్న్న ఒక దేశాన్ని అస్తవ్యస్తం చెయ్యాలి అనుకునే ఒక తీవ్రవాదికి మద్దతుగా విద్యార్ధులు నినదించిన తీరు అన్నిటికంటే ఎక్కువగా భయపెడుతున్న విషయం. యూనివర్సిటీ లో చదువుకోవాల్సిన విద్యార్ధులు ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం భవిష్యత్తు రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: