నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో భూ దందా దారుణంగా సాగుతోంది అని వై ఎస్ జగన్ కి చెందిన సాక్షి పేపర్ లో అతి పెద్ద కాలం రాసారు. భారీ హెడ్డింగ్ తో కథనాలు ప్రచురించగా వీటి విషయం ఇపుడు ఎక్కడ చూసినా కలకలం రేపుతోంది. సాక్షి రాసిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు అని టీడీపీ మంత్రులు కొందరు చెబుతూ ఉండగా మరి కొందరు మాత్రం భూములు తామే కొనుగోలు చేసాం అని మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతున్నారు. సాక్షి పత్రిక రాసిన మాటల వలన తమ పరువు , ప్రతిష్ట దెబ్బతిన్నాయి అని గుంటూరు జిల్లా టీడీపీ నేత పొన్నూరు శాసన సభ్యుడు నరేంద్ర హై కోర్టు లో పిటీషన్ వేసారు . సాక్స్తి పత్రిక తో పాటు ఆ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన తన పిటీషన్ లో కోరారు.


ఈ పిటీషన్ ని విచారణ కి స్వీకరించిన హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజ్ కుమార్ మంగళవారం ఒక తీర్పు బయటకి చెప్పారు. సాక్షి పత్రిక డైరెక్టర్ ల మీద ఈ వ్యవహారం లో తదుపరి చర్యలు ఒద్దు అని తక్షణం నిలిపివేయాలి అని ఆదేశించారు వారు. అమరావతి భూదందా కథనాలు ప్రచురణ చేసిన సాక్షి డైరెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, రాజ ప్రసాద్ రెడ్డి ,  కృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డైరెక్టర్ రామ చంద్ర మూర్తి  , ఎడిటర్ మురళి ల మీద కేసులు నమోదు ఐన సంగతి తెలిసిందే. ఈ కేసు మంగళవారం విచారణ ఉండగా సాక్షి తరఫు న్యాయవాది ఇచ్చిన వాదన జుడ్జీ ఏకీభవించడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: