శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం పీఎస్‑ఎల్వీ సీ - 33 నింగిలోకి దూసుకెళ్లింది. ఉప గ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశించిన సమయంలోనే పీఎస్ఎల్వీ సీ-33 కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో షార్‑లోని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు


ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉప గ్రహ ప్రయోగాలలో ఇది ఆఖరుది. సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇప్పటికే ఆరు ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  ఐఆర్ఎన్‑ఎస్ఎస్ నుంచి రెండు రకాల సేవలు పొందవచ్చు. స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ సేవలు అందుతాయి. అలాగే నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. విమానాలు, నౌకలకు ఐఆర్ఎన్ఎస్ఎస్ దిశానిర్దేశం చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తుంది. దీని ద్వారా ఏ వాహనమైనా ఎక్కడుందో... ఇట్లే పసిగట్టగలం. మొబైల్ ఫోన్లలో ఇంటిగ్రేషన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మ్యాపింగ్, డేటా సేకరణ, ట్రెక్కింగ్, ట్రావెలర్లకు ఇది మరింత ఉపయోగం. 20 మీటర్ల ప్రదేశంలో ఎలాంటి వస్తువునైనా ఈ శాటిలైట్లు ఇట్టే పసిగట్టగలవు. ఈ రాకెట్ 12 ఏళ్ల పాటు సేవలందించనుంది.

1999లో కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ బలగాలు, తీవ్రవాదుల కదలికలపై జీపీఎస్ సమాచారం ఇవ్వాలని భారత్... అమెరికాను కోరింది. అందుకు అమెరికా నిరాకరించింది. దీంతో సొంత నావిగేషన్ కోసం భారత్ అప్పుడే నడుం కట్టింది. ఈ పీఎస్‑ఎల్వీ సీ 33 విజయవంతంతో 17 ఏళ్ల కృషి నేడు సాకారం అయింది.. 1,425 కేజీల ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకు వెళ్లింది. అతి తక్కువ ఖర్చుతో మెగా ప్రాజెక్టును ఇస్త్రో రూపొందించింది. అయితే ఇదే నావిగేషన్ కోసం చైనా 35 శాటిలైట్లను ప్రయోగించింది. అలాగే బైదూ నావిగేషన్ కోసం చైనా భారీగా ఖర్చు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: