ఫలక్‌నుమా... అంటే ఆకాశ దర్పణం. చార్మినార్‌కు చేరువలో... ఎత్తైన కొండ మీద మెరిసే పాలరాతి అందాలతో ఆహ్వానం పలికే రాజభవంతి అది. ఇటలీ వాస్తు నైపుణ్యంతో నిర్మించిన ప్యాలెస్ 32 ఎకరాల్లో విస్తరించి ఉంది. చూడడానికి తేలు ఆకృతిలో ఉండే ఈ ప్యాలెస్‌ను ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ ప్రధాని, పైగా వంశస్తుడు సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. 1884లో ప్రారంభించిన నిర్మాణం పూర్తవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. అప్పట్లోనే ప్యాలెస్ నిర్మాణానికి 40లక్షలు ఖర్చుచేశారు వికార్. 1895లో ఈ భవంతిని ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్‌కు బహుమానంగా ఇచ్చారు. నిజాం నవాబు ఫలక్‌నుమా ప్యాలెస్‌ని తన అతిథిగృహంగా మలచుకున్నారు.

తాజ్ గ్రూప్
1951లో అప్పటి దేశ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆతిథ్యమున్నారు. తరువాత చాలాకాలం మూసి ఉంది. ఫలక్‌నుమా ప్యాలెస్ ఐదేళ్లక్రితం తాజ్ ఫలక్‌నుమాగా మారింది. ఏడో నిజాం మనవడు ముక రంజా ఆధీనంలోని ఈ ప్యాలెస్‌ను తాజ్ గ్రూప్‌కు లీజ్‌కు ఇచ్చారు.

అప్పటి నుంచి శుభకార్యాలు, సమావేశాలు, విందు వినోదాలకు ఈ ప్యాలెస్ వేదికైంది. నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ప్యాలెస్ ముందు వరుసలో ఉంటుంది. నిజాం ఉపయోగించిన వస్తువులు, క్రీడా సామగ్రి, వివిధ దేశాల నుంచి తెచ్చిన వస్తువులు, పుస్తకాలు ప్యాలెస్‌లో ఇప్పటికీ చూడవచ్చు. ఈ హోటల్‌లో ప్రధాన సూట్‌లతో పాటు 60 రూమ్‌లు వినియోగంలో ఉన్నాయి. రూ. 20వేల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె ఉంటుంది.

55


మరింత సమాచారం తెలుసుకోండి: