ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరువు కోరలు చాచిందనే విషయం అందరికీ విదితమే. అయితే కరువు నివారణ చర్యలు చేపట్టని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లీనరీ సమావేశాలను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించింది. అయితే ఈ సమావేశాల పట్ల ప్రతిపక్షాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒదిక్కు కరువుతో ప్రజలంతా అల్లాడిపోతోంటే మరోవైపు ఆవిర్భావ వేడుకలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. దీనిపై కొంత మంది సాంఘిక కార్యకర్తలు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలి సైతం ఈ ఘటనను ఏకరువు పెడుతున్నాయి.

 

 వడదెబ్బ మృతులను, రైతు ఆత్మహత్యలను అపహాస్యం చేసే విధంగా విందు, వినోదాలతో టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి  ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తె లంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కరువు సహయక చర్యల కోసం పోరాటం చేస్తుంటే టిఆర్‌ఎస్ మాత్రం కరు వు లేదనే చందంగా ప్లీనరీ సమావేశాలు జరుపుకుంటూ విందూ, వినోదాలతో హాంగామా  సృష్టించారని, ఆ పార్టీ ఆలోచనలు ప్రజలకు దూరంగా ఉన్నాయని, కనీసం ప్రజల కష్టాలను పట్టించుకునే నాధుడే లేడని ఆయన విమ ర్శిం చారు.

 

 ప్రజా సమస్యలపై తూతూ మంత్రంగా 14 తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చ లేకుండానే ఆమో దించేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా లీటర్ల  చొప్పున నీటిని, కిలోల చొప్పున గడ్డిని కొనుక్కునే పరిస్థితి నెలకొందన్నారు. కరువు సహయక చర్యలను చేపట్టేందుకు కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్లను ఖర్చు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేకపోవడం విచాకరమన్నారు. ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు కరువుపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు. టిజెఎసి ఛైర్మన్ కోదండరామ్ కరువుపై నివేది క ఇస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: