ప్రభుత్వ ఉద్యోగి అంటేనే లంచానికి ప్రతిరూపంగా మారుతున్నారు. అయితే అందరు ప్రభుత్వ ఉద్యోగులనూ ఒకే గాటన కట్టలేం. కొందరు అవినీతి పరులున్నా.. వారికి లంచాలు మెక్కే చాన్సురాదు.. మరికొందరు ఎంత నీతివంతంగా ఉందామన్నా వీలు లేని పోస్టులు కొన్ని ఉంటాయి. రవాణాశాఖలో ఉద్యోగం అంటే ఇంచుమించు అలాంటిదే.. 

ఈ శాఖలో లంచాల జోరు ఎలా ఉందో ఈ ఉద్యోగిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ ఉద్యోగి వివరాలు చెప్పలేదు కదూ.. ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఉప రవాణా కమిషనర్  మోహన్. ఈయన బాగా లంచాలు మేస్తున్నట్టు ఏసీబీకి సమాచారం అందింది. ఇంకేముంది.. ఆయన ఇంటిపై దాడులు మొదలుపెట్టారు. కానీ దాడి మొదలు పెట్టిన కొద్దిసేపటికి కానీ వారికి తెలియలేదు.. తామో అనకొండను పట్టామని.

మోహన్ ఆస్తుల చిట్టా బయటపడుతున్న కొద్దీ ఏసీబీ అధికారులు సైతం తెల్లబోయార. విలువైన ఖాళీ స్థలాల ఎకరాల కొద్దీ ఉన్నాయి. ఇక అపార్ట్ మెంట్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనే కాదు మనోడు కర్ణాటకలోనూ ఆస్తులు కూడబెట్టాడు. ఇక బంగారం, వెండి నగలకు లెక్కేలేదు. ఒకటి కాదు రెండు కాదు.. మొత్తం 8 చోట్ల వరకూ ఏసీబీ దాడులు చేస్తోంది. 

ప్రకాశం జిల్లాలో మోహన్ కు 50 ఎకరాలు వరకూ భూములు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ పది ఎకరాలు భూములు ఉన్నాయి. హైదరాబాద్ లోని కాస్ట్లీ ఏరియాలైన మాదాపూర్, జూబ్లీహిల్స్, కొంపల్లి, పంజాగుట్టల్లో అనేక అపార్ట్ మెంట్లు ఉన్నాయి. బళ్లారిలోనూ ఓ అపార్ట్ మెంట్ కట్టిస్తున్నాడట. బహుశా టైల్స్ వేస్తున్నారేమో.. ఇవే కాకుండా ఆయన కుమార్తె పేరు మీద కూడా అనేక ఆస్తులు ఉన్నాయట. ఈ మొత్తం విలువ వందల కోట్లలోనే ఉంటుందని అనధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: