రాష్ట్రంలో కరువు, దుర్భిక్ష పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు, వ్యూహాలు అవలంబించాలో అధికా రులు, జిల్లా కలెక్టర్లకు విపులంగా వివరిం చారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్‌హెచ్ ఆర్‌డి)లో శుక్రవారం జిల్లా కలెక్టర్ల సమావే శం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. కరువు, వడగాడ్పు లు, ఎండవేడి, భూగర్భ జలాలు తగ్గిపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన సహాయక చర్యలు తీసుకోవడానికి అధికా రులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్ కోరారు. ఎండవేడి ఎక్కువగా ఉన్నం దు వల్ల ఉపాధి హామీ పనులు మధ్యాహ్నం చేయించవద్దని, ఉదయం, సాయంత్రం వేళ ల్లోనే చేయించాలని చెప్పారు. పట్టణాలు, గ్రా మాల్లో వడదెబ్బ మందులు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తిండిలేక బాధపడితే వెంటనే స్పందిం చాలని, ప్రభుత్వం అక్కడ యుద్ధప్రాతిపదికన చర్యలుతీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.


వడదెబ్బల వల్ల మరణించిన వారి కుటుం బాలకు అపద్బంధు పథకం ద్వారా సహాయ మంజూరు చేయాలని సిఎం కెసి ఆర్ సూచించారు. 65 సంవత్సరాల వయస్సులోపు వారికే ఇవ్వాలన్న నిబం ధన తొలగించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నందున మంచినీటితో పాటు ఇతర సమస్యలు ఉన్నాయి, మరో నెల, నెలన్నర వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అప్పటి దాకా పరిస్థితిని ఎదుర్కొవడానికి అవ సరమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోవాలని, ప్రజలకు ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని ఆయన సూచించారు. చలివేం ద్రాలు ఏర్పాటు చేయాలి, మంచినీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా రవాణ చేయాలన్నారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10.30 గంటల లో పు, సాయంత్రం 4.30 తరువాత చేయించాలి. కరువు, ఎండవేడిమి తదితర కారణాల వల్ల మంచినీటి సమస్య, భూగర్భ జలాలు అడుగంటిపోవడం లా ంటి సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతి నడం వల్లే తరచూ ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితులే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ప్రాధాన్యత, ఆవశ్యకతను తెలియచేస్తా యని ఆయన గుర్తు చేశారు.

 

 పశుగ్రాసం ఎక్కడెంత అవసరం ఉందో అంచనా వేసి పంపిణీ చేయాలని కోరారు. ఈసారి మంచి వర్షాలు కు రుస్తాయనే అంచనాలు ఉన్నందున ఖరీఫ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావా లని సిఎం చెప్పారు. పత్తికి రానున్న రోజుల్లో పెద్దగా మార్కెట్ ఉండదని, రైతు లను ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలని అన్నారు. నైరోబీలో జరిగిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్లూటిఒ) సమావేశంలో పత్తి ఎగుమతులపై ఉన్న పన్ను రాయితీని ఉపసంహరించే తీర్మానంపై భారతదేశం సంతకం చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. సోయాబీన్ తదితర పంటల సాగుకు రైతుల ను ప్రోత్సహించాలని, విస్తృత ప్రచారం కల్పించాలని సిఎం కెసిఆర్ అధికా రులను సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు జిల్లాల్లోని కరవు, వడదెబ్బ, ఎండల తీవ్ర త పరిణామాలను వివరించారు.


మిషన్ భగీరథ పూర్తయితే ఇక మంచినీటికి కొదువ ఉండదని, మిషన్ కాకతీయ పూర్తయితే చెరువులు నిండి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు. సిద్ధిపేటలో మంచినీటి పథకం పూర్త వుతున్నందున అక్కడ కరువు ప్రభావం లేదని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి రా వాలి అని ముఖ్యమంత్రి అన్నారు.
మిషన్ భగీరథ:వర్షాలు వస్తే పనిచేయడం సాధ్యపడదు గనుక, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే వ్యవసాయ భూముల్లోంచి పోయే విధంగా పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. జిల్లాల వారీగా ఇన్‌టే క్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పంప్‌హౌస్, పవర్ స్టేషన్లు, పైపులైన్ల ని ర్మాణం పురోగతిని కలెక్టర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్లూస్) అధికారులతో సిఎం సమీక్షించారు. నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను వర్షా లు రాకముందే తెప్పించుకుని పెట్టుకోవాలని కెసిఆర్ సూచించారు. పైపులైన్ల నిర్మాణానికి అవసరమయ్యే అటవీ భూముల్లో జాప్యం ఉండరాదని సిఎం ఆదేశించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: