ప్రస్తుతం భారత్ లో పతంజలి తమ ఉత్పత్తులను విస్తరించడానికి సరి కొత్త ప్రణాళికలను రచిస్తోంది. కన్ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న బాబా రాం దేవ్ దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో పతంజలి కొన్ని వేలకోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అన్నింటికన్నా ఎక్కువగా ఉత్తర భారత్ లో పతంజలి ఉత్పత్తులు జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి.

 

అయితే, ఇటీవల కోల్గేట్ పేస్ట్ కి పోటీగా పతంజలి దంతకాంతి పేస్ట్ ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ విదితమే. అయితే, ఇటీవల కోల్గేట్ ఉత్పత్తులను పడగొట్టడానికి దంతకాంతి ని ధీటుగా ప్రవేశపెట్టామని రాం దేవ్ బాబా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన విన్న కోల్గేట్ తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇండియాలో దంత సంరక్షణ ఉత్పత్తుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కోల్గేట్ బ్రాండ్ అమ్మకాలు గత కొంత కాలంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తుండటం, ఇదే సమయంలో పతంజలి ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటంతో నష్ట నివారణకు దిగారు కోల్గేట్ పామోలివ్ గ్లోబల్ సీఈఓ ఇయాన్ కుక్.

 

ఇండియాలోని దంత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2015తో పోలిస్తే 2015లో 0.8 శాతం పెరిగి రూ. 6 వేల కోట్లను దాటింది. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గడం వల్లనే వృద్ధి అనుకున్నంతగా నమోదు కాలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని, 2016లో ఇవి మార్కెట్లోకి వస్తాయని కుక్ వ్యాఖ్యానించారు. "ఇండియాలో సహజ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలోనూ మా ఉత్పత్తులు రానున్నాయి. ఇండియాలోని స్థానిక పోటీదారుల నుంచి వస్తున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం" అని ఇన్వెస్టర్లకు ఇయాన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: