ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైకాపా పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్టు తయారైంది. ఇద్దరు చంద్రుల ఆకర్ష్ రాజకీయాల వల్ల వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అటు అమరావతి పూర్తయ్యేవరకు బాబును, ఇటు తెలంగాణ అభివృద్ధి చెందే వరకు కేసీఆర్ ను తెలుగు రాష్ట్రాల ప్రజలు వదిలేలా లేరు. ఈ కోణంలో చూస్తే దాదాపు ఇంకా పది సంవత్సరాలు ఇవే పార్టీలు తమ అధికారాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది.

 

మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో ఎమెల్యే సైకిల్ ఎక్కుతుండగా, తెలంగాణలో పొంగులేటి కారెక్కడంతో పార్టీ దుకాణం పూర్తిగా మూసుకుపోయింది. మరి ప్రస్తుతం వ్యవహారాన్ని కూలంకుషంగా గమనిస్తున్న వైసీపీ అధినేత జగన్ భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తీసుకొనేఅవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇద్దరు సీనియర్ రాజకీయ నేతల మధ్య నలిగిపోతున్న జగన్ కు ఉపశమనం కలగాలంటే రాజకీయ సన్యాసమే దీనికి సరైన మార్గమని కొందరి భావన.

 

ప్రస్తుతం జగన్ వ్యాపార పరంగా దేశ వ్యాప్తంగా తన సంస్థలను విస్తరించారు. వీటిపై దృష్టి సారిస్తే జగన్ పెద్ద బిసినెస్ మెన్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టం కాబట్టి కొన్న సంవత్సరాలు రాజకీయాలకు టాటా చెప్పడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకుల అబిప్రాయం. పైగా భవిష్యత్తులో పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే రాజకీయ సన్యాసమే బెటర్ అని అంటున్నారు...!


మరింత సమాచారం తెలుసుకోండి: