మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట మనం సంపాదించిన హక్కు ఓటు హక్కు. ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన సాగించాలంటే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలంటే కావాల్సిన కనీస హక్కు ఓటు హక్కు. సరైన పార్టీని ఎన్నుకోడానికి భారత రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప వరం ఓటు హక్కు. ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సామాన్యుడి పాశుపతాస్త్రమును ఓటు హక్కు. ఈ ఓటు హక్కే మన దేశ భవితవ్యాన్ని దిశానిర్దేశం చేస్తుంది. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన ఓటు హక్కుకు 69 సంవత్సరాలు దూరమైంది ఓ గ్రామం.

 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటేస్తున్న కూచ్ బెహార్ గ్రామం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాలోని 51 సమూహాలకు చెందిన 9 వేల మంది ఓటర్లు ఈ నెల 5వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇన్నేళ్లపాటు ఆ గ్రామస్తులను ఏ దేశానికీ చెందిన వారిగా పరిగణించకపోవడంతో వారికి ఓటు హక్కు లేదు. ఈ విషయమై భారత్, బంగ్లాదేశ్ లు చర్చించుకున్న అనంతరం, గత ఏడాది 15న ఈ ప్రాంతాలను పంచుకున్నాయి.

 

మొత్తం 162 ప్రజా సమూహాల్లో బంగ్లాదేశ్ కు 111, భారత్ కు 51 ప్రజాసమూహాలు వచ్చాయి. ఈ ప్రజాసమూహాల్లో మొత్తం జనాభా 15 వేల మంది. ఇందులో అర్హత కల్గిన ఓటర్లు సుమారు 9,776 మంది. పశ్చిమబెంగాల్ లో ఈ నెల 5న జరగనున్న చివరి విడత పోలింగ్ లో వీరు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: