ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం నుండి ఎక్కువగా సహాయం అందేది దేనికి అంటే టక్కున వచ్చే సమాధానం ఆంధ్రప్రదేశ్ అనే. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వంలో మోడీ తర్వాత అంతటి పెద్ద పాత్ర పోషిస్తున్న కేంద్ర మాత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా సిజనా చౌదరీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరీ లాంటి వాళ్లు ఉన్నా ఏపీ ఎందుకు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ మొదలయింది. దీన్ని ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకొన్నాయి.

 

ఏకంగా బాబు సామాజిక వర్గానికి చెందిన నేత రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నా, ప్రధాని మోడీ సిద్ధాంతం ప్రకారం మనం ఏ రాష్ట్రానికి చెందిన వారమైనా, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు జరపడం, వారి వారి రాష్ట్రాలను, ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం లాంటి స్వార్థపర రాజకీయాలను ఆయన సహించరు. అందుకే ఏపీ కి ముగ్గురు మంత్రులున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే కనబడుతుంది. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర సహం చేయాలని కోరినా కేంద్రం అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. వెంకయ్య నాయుడు ఏపీ కి సహం చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నా ఏదో కొద్దో గొప్పో తప్పితే పూర్తిగా సహాయం చేసే అవకాశాలు మాత్రం కనబడట్లేదు.

 

కేంద్ర మంత్రి అంటే అది కేవలం ఒక్క రాష్ట్రానికిమాత్రమే కాదు, దేశానికంతటికీ అనే సూత్రం మోడీ ప్రభుత్వానిది. అయినా భవిష్యత్తులో ఎపీకి అనను విధాలా సహాయపడతామని హామీ ఇచ్చిన, రాజధాని నిర్మాణానికి సహాయపడతామని సుముఖం వ్యక్తం చేసినా, ఏపీ ముఖ్యమంత్రితో పాటు, ప్రజల్లో చిన్న కలవరం నెలకొంది. ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకొన్న రాష్ట్రాన్ని ఆదుకొనే పెద్ద దిక్కు కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎపీకి ప్రత్యేక హోదా కల్పించి, రాజధాని నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని ప్రజలంతా అకేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: