తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలుగు రాష్ట్రాలని, కేంద్రంలో దేశాన్ని పాలించింది హస్తం పార్టీనే అనే విష్యం అందరికీ విదితమే. అప్పుడు బయట పడ్డా వేలకోట్ల స్కాం లు ఎ ప్రభుత్వంలోనూ బయటపడలేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యేవారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కేసీఆర్ హస్తం పార్టీని కడిగి పారేశేవారు. వైఎస్ హయాంలో కట్టించిన ప్రాజెక్టులన్నీ ఆంధ్రా ప్రాంతం కోసమే అని, వారి వల్ల ఎడారిగా మారేది తెలంగాణ రాష్ట్రమేనని ఆ పార్టీపై దుమ్మెత్తిపోసేవారు.

 

అయితే అధికారంలో ఉన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లూ పార్టీ అధినాయకత్వాన్ని వెనుకేసుకొచ్చేవారు. వారు ఏం మాట్లాడినా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా శభాష్ అనేవారు. అప్పుడు కాంగ్రెస్ చేపట్టిన మంచిపనులను  ఎందరో ప్రతిపక్ష నాయకులు పొగిడిన సందర్భాలు ఎన్నో...! అయితే ఈ విషయాన్ని మరిచిన కాంగ్రెస్ పార్టీ, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకొన్నా ఒప్పందం పట్ల భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయన లేవనెత్తిన పట్ల యావత్ తెలంగాణ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

గత 40 ఏండ్లకూ పైగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు గాలికి వదిలేసి తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్పుడు మాట్లాడకుండా ప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్న తీరును చూస్తుంటే, కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం చేసుకొని, మొన్న మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ శంఖుస్థాపన చేసిన విషయం అందరికీ విదితమే. ఐతే దానిపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోకుండా ఎలా శంఖుస్థాపన చేస్తారని ఆయన కేసీఆర్ ని ప్రశించారు. దీనిపై కేసీఆర్ కౌంటర్ అటాక్ ఎ విధంగా ఉండనుందో చూడాలి మరి...!


మరింత సమాచారం తెలుసుకోండి: