సమాచార హక్కు చట్టం అనే ఆయుధాన్ని అడ్డంపెట్టుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోడీ పై మంది పడుతున్నారు. తాను చదివినట్లు చూపిస్తున్న డిగ్రీలన్నీ ఫోర్జరీ చేసినవే అని ఆయన ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా మోడ్ విద్యార్హతలపై కేజ్రీవాల్ ప్రశ్నలను ఎక్కుపెడుతునే ఉన్నారు. ఆయాన్ అసలు గిగ్రీలు చేయలేదని వివిధ యూనివర్సిటీలు చూపిస్తున్న సర్టిఫికెట్లు అన్నీ నకిలీ వే అని ఆయన ఆరోపిస్తున్నారు.

 

సుర్బజిత్ రాయ్ అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ విద్యార్హతల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వచ్చిన లేఖను కూడా ఆయన తన ట్వీట్‌తో పాటు జతపరిచారు. తన డిగ్రీల గురించి ఖరగ్‌పూర్ ఐఐటీ ఇంత స్పష్టంగా చెబుతోందని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులు ఆడుతోందని ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయనకు డిగ్రీలు లేవని కూడా కేజ్రీవాల్ సూత్రీకరించేశారు. ఆయన యూనివర్సిటీలో చేరడం, ఆయన డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం.. ఇలాంటి వాటికి సంబంధించిన రికార్డులు ఏవీ ఢిల్లీ యూనివర్సిటీలో లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

 

ఈ విషయంపై ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ప్రధాని డిగ్రీల రికార్డులు చూపించడానికి ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరిస్తోందని..  అది ఎందుకని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అక్కడి నుంచి బీఏ చేయలేదని అన్నారు. కొన్ని పత్రికలు ప్రచురించిన డిగ్రీలు ఫోర్జరీవని కూడా సీఎం ఆరోపించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో తన డిగ్రీల గురించి కొంతమంది ప్రశ్నించారని, వెంటనే తాను దాన్ని రుజువు చేసుకున్నానని అన్నారు. తనకు అక్కడి నుంచి డిగ్రీ ఉందని కూడా తెలిపారు. కేజ్రీవాల్ విమర్శల పట్ల మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఆశర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: