నేను బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నాయకులను హెచ్చరించారు. మేము ఎంతో ఓపికతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని మా ఓపికకు పరేఎక్శ పెట్టొద్దని కేసీఆర్ గట్టిగానే హెచ్చరించారు. గోదావరి నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలివిలేని మీరు తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీకు చేత కాకుంటే చెప్పండి, గోదావరి నీరు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని ఆయన హెచ్చరించారు. పడుకున్న బెబ్బులిని లేపి గొడవ పెట్టుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా నేతలను హెచ్చరించారు.


హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మీ చిల్లర రాజకీయాలు తన దగ్గర పని చేయవని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల సంగతి తనకు తెలుసని ఆయన అన్నారు. తన దగ్గర నాటకాలాడవద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ఉన్న అంతో ఇంతో మర్యాదని పొగొట్టుకోవద్దని ఏపీ నేతలకు ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ఆటలాడుకోవాలని చూస్తే...తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


అయితే ఆయన కామెంట పై ఇంకా ఆ నాయకులు కౌంటర్ అటాక్ ఇంకా ఇవ్వలేదు. గోదావరి జాలాల మీద మహారాష్ట్ర తో నీటి ఒప్పందం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ జరిపించడం పట్ల ఇప్పటకే బాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై రుసరుసలాడుతున్న బాబు ఈ కామెంట్ పై ఏవిధంగా స్పందించనున్నారో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: