ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ.. ఓ పార్టీ చరిత్ర చూసినా అన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడే కాదు..అసలు బడుగులుగా చెప్పుకునే బీసీల నాయకత్వంలో ఉన్న పార్టీలే లేవు. కానీ జనాభాలో మాత్రం సగానికిపైగా బీసీలే ఉన్నారు. మరి బీసీల కోసమే ఓ పార్టీ పెడతే ఎలా ఉంటుంది.. బీసీ ఓట్లన్నీ ఓటు బ్యాంకుగా మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది.. ?

ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య. ఆంధ్రా, తెలంగాణలో బీసి సంఘాల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని కృష్ణయ్య విజయవాడలో ప్రకటించారు. గవర్నర్ పేట ఐవి ప్యాలెస్ లో పోతీన మహేష్ ఆధ్వర్యంలో బీసి శంఖరామం సభ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆర్ కృష్ణయ్యతో పలువురు రాష్ట్రనేతలు పాల్గొన్నారు.

పవన్ బీసీలతో జత కడతారా..!?

ఎంతకాలం దొరల పార్టీల కింద పని చేస్తాం..  తమకి రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో కొత్త పార్టీ పెడుతున్నామని ఆర్. కృష్ణయ్య అంటున్నారు. కేవలం బీసీల ఓట్లు వేసుకున్నా తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన దీమాగా చెబుతున్నారు. గతంలో యూపీ, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి బడుగు వర్గాల పార్టీలు విజయవంతం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. 

అంతే కాదు.. బడుగులు అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తానంటున్న పవన్ కల్యాణ్ తో తమ పార్టీ జత కట్టే అవకాశం ఉందని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. తామూ, పవన్ కల్యాణ్ జత కలిస్తే ఏ శక్తీ అడ్డుకోలేదని ఆర్. కృష్ణయ్య అంటున్నారు. పవన్ కల్యాణే కాదు.. ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని కృష్ణయ్య చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: