భూకంపాలు వచ్చినా తెలంగాణ ప్రాజెక్టులు ఆపేది లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించారు. తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటాయని... వీటిని అడ్డుకుని తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదీ జలాల పంపకాల విషయమై.. అపెక్స్ కమిటీని సమావేశపరచాలని కేంద్రాన్ని కోరామన్నారు.

నీటి ప్రాజెక్టుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ లో తెలంగాణా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతోందని.. చంద్రబాబు శ్రీకాకుళం సభలో విమర్శించారు. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీటికి ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

నీళ్లు అడ్డుకుంటే ఊరుకోం.. 

శ్రీకాకుళంలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. తెలంగాణా ప్రాజెక్టుల విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి వర్గ తీర్మానం చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లోకి నీరు రాకుండా ఎగువ రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని.. తెలంగాణా ప్రాజెక్టులతో మరింత నష్టం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలోని నీటివనరుల గురించి మాట్లాడుతూ నాగావళి నుంచి వంశధారకు కాలువలు తవ్వితే గ్రావిటీతో నీళ్లు వస్తాయని చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో నూతనంగా రెయిన్ గన్ ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. నీళ్ల కోసం వినూత్నమైన ఆలోచనలకు ఆజ్యం పోయాల్సిన అవసరముందన్నారు. సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి..గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత ఎపి సర్కార్ దే అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: