ప్రేమ గుడ్డిది అంటారు..కానీ అదే ప్రేమ ఉన్మాదానికి కూడా దారితీస్తుందని ఎన్నో ఘటనల్లో చూశాం..తాజాగా ఓ ప్రమోన్మాది తనను ప్రేమించడం లేదని వివాహం జరిగిన మహిళలను అతి దారుణంగా చంపిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంగడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళఇతే..జార్ఖండ్ రాష్ట్రంలోని రాంగడ్‌లో సోనాలీ (30) బీఈడీ చేస్తుంది..ప్రతిరోజూ ఆమె భర్త కళాశాల వద్ద విడిచి వెళ్లేవారు. అదే కళాశాల వద్ద ఉండే  సుకేన్ మండల్‌ అనే వ్యక్తి నిత్యం సోనాలిని వేధిస్తూ ఉండేవాడు. సోనాలికి వివాహం జరిగిందని తెలిసి కూడా సుకేన్ ఆమె వెంట పడుతూ ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చేవాడు.

అయితే బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సోనాలి ఇక తిరిగిరాలేదు.  ఏమి జరిగి ఉంటుందోనని ఆమె కోసం వెతకగా ఆమె కళాశాల గేటు ముందు శవమై పడి కనిపించింది. ఆమె రెండు చేతులు నరికివేయబడి ఉన్నాయి.

ఆమె శరీరం పైన 20 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సుకేన్ మండల్.. సోనాలిని హత్య చేసి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: