ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అన్ని పురపాలికల్లో సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిసైడయ్యింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 500కెవి సౌరవిద్యుత్ ప్లాంటును ఆయన ప్రారంభించారు.


ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా నగరపాలక సంస్థకు ఏటా 18లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలిపారు. ఈ ప్లాంటుని ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయటం ద్వారా డబ్బు ఆదా అవుతుందని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని నారాయణ అంటున్నారు.


ఇటీవల ఏపీ సర్కారు విద్యుత్ వాడకంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తోంది. విద్యుత్ ఆదాకు ప్రయారిటీ ఇస్తోంది. సోలార్ విద్యుత్ వినియోగాన్ని బాగా ప్రోత్సహిస్తోంది.ఇళ్లలో బల్బులు, ఫ్యాన్లు, రైతుల మోటార్ పంపులు అన్ని చోట్లా విద్యుత్ ఆదాకు ప్రయత్నిస్తోంది.


ప్రారంభంలో ఖర్చు ఎక్కువైనా... లాంగ్ రన్ లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చాలా చౌకగా విద్యుత్ అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి.. వారి సాయంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తోంది. ఖర్చు తక్కువ, పర్యావరణహితం అయిన ఈ సోలార్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న బాబును మెచ్చుకోవాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: