ఇటీవల రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ నీటి ఆవశ్యకత గురించి ప్రసంగించారు. నీరు ఎంత అవసరం, దాన్ని కాపాడుకునే ఆవశ్యకత అంతా వివరించారు. తన ప్రసంగంలో ప్రతిసారీ కొందరు వ్యక్తులను, సంస్థలను ప్రస్తావించడం మోడీకి అలావాటైపోయింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు-ప్రగతి కార్యక్రమం బాగా అమలవుతోందంటూ మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. 

మోడీ ప్రశంసలు ఏపీ సీఎం చంద్రబాబులో అంతులేని ఉత్సాహాన్ని నింపాయి. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రశంసించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో అధికారులు మరింత ఉత్సాహంగా పని చేయాలని అధికారులకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. నీరు ప్రగతితో పాటు పంట సంజీవని, నీరు-చెట్టు కార్యక్రమాలు కూడా మరింత చురుకుగా కొనసాగించాలని చెప్పారు. 

మన్ కీ బాత్ లో ఏపీ ప్రస్తావన.. 



నీరు ప్రగతి పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి అధికార యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్ గన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్, ఉపరితల, భూగర్భజలాల సంరక్షణ వంటి అంశాలపై అధికారుకు దిశానిర్దేశం చేశారు. జలవనరుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. 

తుపానువల్ల 7 సెంటీమీటర్ల వర్షపాతం పడిందని.., ఇంకా 7 సెంమీటర్ల వర్షపాతంలోటు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. భూగర్భజలాల మట్టం 1.51 మీటర్లకు పెరిగినందున, పంట సంజీవని, నీరు-చెట్టు కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయటంతో పాటు  ప్రతి 50 ఇళ్లకు భూమివాలును బట్టి వీటిని ఏర్పాటుచేయాలన్నారు.

వీటితో పాటు వర్మికంపోస్టు తయారీ యూనిట్లు అన్ని గ్రామాలలో, పట్టణాలలో నెలకొల్పాలన్నారు. గ్రామాలలో రోజుకు 457 మెట్రిక్ టన్నులు, పట్టణాలలో 1200 మెట్రిక్ టన్నులు వర్మికంపోస్టు తయాిరీకి అవకాశం ఉందని..., దీనివల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గి, సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతుంది కాబట్టి ఘన వ్యర్ధాల నియంత్రణపై, వర్మికంపోస్టు తయారీపై దృష్టిపెట్టాలన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: