తమిళనాడు రాజకీయాల్లో కక్ష, కార్పణ్యాల పాలు ఒకింత ఎక్కువే. వీటి కారణంగా కనీస సంప్రదాయాలు కూడా పాటించకపోవడం అక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ విచిత్రంగా జయలలిత ప్రమాణ స్వీకారం రోజుతోనే ఈ కక్షసాధింపు మొదలైందన్న వాదనలు అప్పుడే వినిపించడం ప్రారంభిచాయి. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత రెండో విడతను ఓ వివాదంతో ప్రారంభించారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి గా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డీఎంకే పార్టీ నేతలను కూడా ఆహ్వానించారు. సాధారణంగా జయలలిత కార్యక్రమాలకు డీఎంకే నేతలు  దూరంగా ఉంటారు. అవి అధికారిక కార్యక్రమాలైనా సరే. ఇక ఇలాంటి ఉత్సవాలు, వేడుకలైతే హాజరయ్యే సమస్యే ఉండదు. కానీ విచిత్రంగా ఈసారి జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కరుణానిధి కుమారుడు స్టాలిన్ హాజరయ్యారు. 

పిలిచి మరీ అవమానిస్తారా.. - స్టాలిన్.. 



జయలలిత ప్రత్యేకంగా మంత్రుల బృందాన్ని పంపించి కరుణానిధిని, ఇతర డీఎంకే నేతలను ఆహ్వానించిందట. పోనీలే ప్రత్యేకంగా ఇంటికొచ్చి మరీ పిలిచారుగా వెళ్లకపోతే బావుండదన్నట్టుగా కరుణానిధి తాను వెళ్లకుండా కుమారుడు స్టాలిన్ ను పంపారు. వయసు రీత్యా కూడా కరుణానిధి ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావడం కష్టమే. అందుకే స్టాలిన్ వెళ్లారు. 

కానీ స్టాలిన్ కు ప్రమాణ స్వీకారోత్సవంలో తగిన మర్యాద లభించ లేదట. బలమైన ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నేత అయినా ఆయన్నో అనామకుడుగానే ట్రీట్ చేశారట. ఆయనను సగౌరవంగా ముందువరుసలో కూర్చోబెట్టవలసింది పోయి..ఎక్కడో పదో వరసలో కూర్చోబెట్టారట. అంతే కాదు.. ప్రముఖ నటుడు, ఈ ఎన్నికలలో ఓడిపోయిన శరత్ కుమార్ ను మాత్రం ముందు వరసలో కూర్చోబెట్టారట. ఈ వివాదంపై కరుణానిది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: