ఉన్నఊళ్లో, కన్నభూమిలో ఉపాధి లేక.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలో దిగుతుండటం సాధారణ విషయమే. కానీ డబ్బు సంపాదన కోసం పేదరికం కారణంగా వీరు దేశాలు దాటిపోతున్నారని.. అక్కడ అంగడి సరుకుల్లా అమ్ముడుపోతున్నారన్న వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ విషయాలను సాక్షాత్తూ మంత్రులే వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు గల్ఫ్ దేశాలలో అంగడి సరుకు మాదిరి అమ్ముడుపోతున్నారని ఆంధ్రా ఎన్ ఆర్ ఐ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు తెలిపారు. వారందరినీ రక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉందని.. కేంద్రం సాయం తీసుకుని తెలుగమ్మాయిలను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పల్లె అభిప్రాయపడ్డారు. 

దేశం కాని దేశంలో ఎన్ని కష్టాలో.. 



సౌదీ అరేబియా, బహ్రయిన్, కువైట్ వంటి దేశాల వారికి మన తెలుగమ్మాయిలను డబ్బు కోసం అమ్మేస్తున్నారట. ఇలా ఒక్కో మహిళను లక్ష నుంచి ఐదు లక్షలు వెచ్చించి కొనుక్కుంటున్నారని తెలుస్తోంది. వీరిని అక్కడ పని మనుషులుగా, లైంగిక సాధనాలుగా వాడుకుంటున్నారని ఇక్కడి సర్కారు దృష్టికి వచ్చింది. మరికొందరు వీసా గడువు దాటిపోవడం వల్ల ఆయా దేశాల నుంచి ఎలా రావాలో తెలియక మగ్గిపోతున్నారు.  

ముస్లిందేశాల్లో చట్టాలు విచిత్రంగా ఉంటాయి. ప్రతి చిన్న నేరానికీ ఎక్కువ శిక్ష ఉంటుంది. తెలిసీ తెలియక అక్కడికి వెళ్లిన తెలుగు మహిళలు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతో తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారట. అక్కడి యజమానుల వేధింపులు తట్టుకోలేని కొందరు తమను రక్షించాలని కోరుతూ ఇక్కడి ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశారట. మరి ఇకనైనా విదేశాల్లో మగ్గుతున్న తెలుగమ్మాయిలను స్వదేశానికి రప్పిస్తారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: