సాక్షి పత్రిక ఇటీవల కాస్త స్టాండ్ మార్చింది. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదట్లో టీఆర్ఎస్ పై అన్నీ పాజిటివ్ వార్తలే ఇచ్చిన సాక్షి పత్రిక కొన్నాళ్లుగా కేసీఆర్ సర్కారు పనితీరుపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. అది కూడా ఎఫెక్టివ్ మ్యానర్ లో. కేసీఆర్ కూ జగన్ కూ దూరం పెరగడమే ఇందుకు కాణంగా చాలా మంది భావిస్తున్నారు.

సాక్షి పత్రిక, మీడియా తీరును నిశితంగా గమనించిన టీఆర్ఎస్ సర్కారు ఇప్పుడు కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఓ పాత కేసు విషయంలో టీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రియలన్స్ హస్తం ఉందంటూ కొన్ని తెలుగు చానళ్లు కథనాలు ఇచ్చాయి. 

సాక్షిపై అంతకోపమేల.. !



ఓ రష్యన్ వెబ్ సైట్ వార్త ఆధారంగా సాక్షి, టీవీ5, ఎన్టీవీ బ్రేకింగ్ న్యూసులు వేసి నానా హడావిడి సృష్టించాయి. ఆ కేసుల విషయంలో అప్పట్లో టీవీ5 ఎడిటర్ గా ఉన్న వెంకట కృష్ణ అనే పాత్రికేయుడిని అరెస్టు చేయడం కూడా జరిగింది. అప్పట్లో పెట్టిన కేసుల దర్యాప్తు ఇంకా సాగుతూనే ఉంది. ఈ ఛానళ్లపై అప్పట్లో పోలీసులు దేశద్రోహం నేరం కింద కేసులు పెట్టారు. 

ఐతే.. సాక్షి టీవీ ముందుగా బ్రేకింగులు వేసిందని.. దాన్ని తాము గుడ్డిగా అనుసరించామని.. తమ తప్పును మన్నించమని టీవీ5, ఎన్టీవీ ఛానళ్లు తెలంగాణ సర్కారుకు లేఖలు రాశాయి. ఇదే తరహాలో సాక్షి పత్రిక కూడా తమను క్షమించమంటూ తెలంగాణ సర్కారుకు లేఖ రాసిందట. 

ఇప్పుడు టీవీ5, ఎన్టీవీ లేఖలను పరిగణనలోకి తీసుకుని వాటిని కేసుల నుంచి విముక్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోందట. కానీ సాక్షి విషయంలో మాత్రం కేసు మూసేయడం కుదరదని చెబుతోందట. అంటే తన సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సాక్షిపై కేసీఆర్ సర్కారు కక్ష కట్టిందా..!? అన్న అనుమానాలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: