కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల రెండో జాబితాలో వచ్చేసింది. కేంద్ర ప్ర భుత్వం చారిత్రక నగరాలను అభివృద్ధి పరిచే దిశలో నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. పట్టణాలను శరవేగంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాల్లో సాంస్కృతిక పునరుజ్జీవన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

13 more cities get smart city tag

తాజాగా  రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్‌కు చోటు లభించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ 13 సిటీల్లో 9కి పైగా 25 శాతం స్మార్ట్ సిటీ హోదా అర్హతను సాధించాయని తెలిపారు. స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద ఆకర్షణీయమైన నగరాల్లో భాగంగా ఇప్పటికే 98 నగరాలను గుర్తించామన్నారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేది నినాదం.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ నినాదం చేపడుతున్నామన్నారు. రాష్ర్టాలతో సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.  


స్మార్ట్ సిటీస్ జాబితా వరుస క్రమంలో :


1. లక్నో


2. వరంగల్

3. ధర్మశాల

4. చండీఘర్

5. రాయ్‌పూర్

6. న్యూ టౌన్ కోల్‌కతా

7. భగల్‌పూర్

8. పనాజీ

9. పోర్టు బ్లెయర్

10. ఇంఫాల్

11. రాంచీ

12. అగర్తాలా

13. ఫరీదాబాద్. 


మరింత సమాచారం తెలుసుకోండి: