"ప్రతి అదృష్టం వెనుక ఒక నేఱం తప్పక ఉంటుంది

ప్రతి అదృష్టం ఒక నేఱం నీడలోనే మొదలౌతుంది

ప్రతి అదృష్ట మూలం నేర మయమై ఉంటుంది "


డొనాల్డ్ ట్రంప్ & మలానియా ట్రంప్

 

 

భారత్ పై భారతీయులపై ఇష్టానుసారం వాఖ్యలు చేస్తూ, తానే అమెరికన్ బార్న్ గా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ బ్రతుకులో కూడా అనేక కోణాలున్నాయని, ఎన్నికలు తుదిదశకు చేరే తరుణంలో అనేక చీకటి కోణాలు వెలుగులోనికి వస్తున్నాయి. బాల్జాక్ అనే ఒక మహనీయుడు చెప్పినట్లు "ప్రతి భాగ్యం (అదృష్టం) వెనుక ఒక నేఱం తప్పక ఉంటుంది, ప్రతి భాగ్యం (అదృష్టం) ఒక నేఱం నీడలోనే మొదలౌతుంది, ప్రతి భాగ్యం (అదృష్టం) మూలం నేర మయమై ఉన్నాయి" అమెరికా లోనే అత్యంత భాగ్యవంతుడు, రియల్ వ్యాపారైన ట్రంపు అదృష్టవంతుడవటానికి ఒక నేర మయ సామ్రాజ్యం తో చీకటి ఒప్పందాలు, సంభందాలు ఉండేవని వార్తలున్నాయి.


జర్నలిస్ట్ వానే బార్రెట్

 Image result for wayne barrett journalist

 

డొనాల్డ్ ట్రంప్ కు చెందిన తళతళ మెరిసే న్యూయార్క్ స్కై స్క్రాపెర్స్ మరియు అట్లాంటిక్ సిటి కాసినోస్ తో కూడిన మహా వ్యాపార సామ్రాజ్యం నిర్మాణము లో మహాభయకరమైన మాఫియా చీకటి కుటుంబాల సహకారం ఉందనే అనేక ఆరోపణలు ఉన్న్నాయి. న్యూయార్క్ జర్నలిస్ట్ వానే బార్రెట్ తన సి ఎన్ ఎన్ ఇంటెర్వ్యులో డొనాల్డ్ కున్న మోబ్ కన్నెక్షన్స్చాల అసాధారణం మరియు అనంతం”  అని తెలిపారు  ట్రంపు కు ఫిలడెల్ఫియ మరియు న్యూయార్క్ నేఱ కుటుంబాలతో సంబంధానికి దశాబ్దాల చరిత్ర ఉందని అనేక వార్తాపత్రికలలో, ప్రభుత్వ పత్రాల్లో వచ్చినట్లు ఆయన 1992 లో ప్రచురించిన ట్రంప్ అనధికార జీవిత చరిత్ర "ది డీల్స్ & డౌన్-ఫాల్" పేరుతో ఒక పుస్తకం కూడా ప్రచురితమైనట్లు వివరించారు. ఆయన ఏదుగుదలంతా చీకటి సామ్రాజ్య సంబందమేనని ఆయన,  “చీకటి ప్రపంచముతో అవిభక్త బంధాలు” (Intertwines with underworld) అనే మరో బుక్ లో వివరించారు.

   

1980 లో ప్రతిష్టాత్మక  58  స్టొరీడ్  ట్రంప్ ప్లాజా, ట్రంప్ టవర్జ్  నిర్మాణాన్ని "ఎస్ & కాంక్రీట్" అనబడే సంస్థ సబ్-కాంట్రాక్ట్ ఒప్పందాలు కలిగి ఉన్నాడు. సంస్థ లో ఫాట్ టొని ("ఆంథొని 'ఫాట్ టొనీ  సాలెర్నొఅనబడే ఒకజెనోవీజ్’  నేర కుటుంబానికి యజమాని)  మాఫియా డాన్, పెట్టుబడులు పెట్టి ఉన్నాడు. ఆయన ప్రొద్భలంతోనే ట్రంప్ కాంట్రాక్ట్ ను అవార్డ్ చేశాడని అంటారు. దీనిని అక్టొబర్, 2015 లో వాల్ స్ట్రీట్ జర్నల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో అంగీకరించాడు. కూడా. విషయాన్ని పులిట్జెర్ అవార్డ్ గ్రహీత డేవిడ్ కె జాన్-స్టన్ 



డేవిడ్ కె జాన్-స్టన్ 


అనే పాత్రికేయుడుట్రంప్-ఫాట్ రిలేషన్స్”  గురించి ఒక పత్రికలోటాప్-స్టోరీ’  ప్రచురించాడు. దీనినిటైం’ మరియుడైలీ బీస్ట్’  లాంటి ప్రముఖ పత్రికలు కూడా ప్రచురించాయి.

ఎన్నో కేసుల్లో నేరస్తుడుగా తేలి శిక్ష కూడా అనుభవించిన ఫ్యాట్-టోనీ తో ట్రంప్ కు వ్యాపార సంబంధాలున్నాయని తెలిసి అమెరికన్ జనాలు ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే ట్రంప్ కు మాఫియా వాళ్లతో సంబంధాలున్నట్లు వార్తలొచ్చినా అవి కేవలం ఆయన ప్రత్యర్థులు ఆరో పించినవి మాత్రమే. కానీ జాన్-స్టన్ లాంటి ప్రతిభావంతులైన  పాత్రికేయులు ఆధార సహితంగా కథనాలు ప్రచురించడంతో ట్రంప్ కు ప్రమాదకరమైన పరిస్థితేనని రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బే అని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఫ్యాట్-టోనీ తో తనకు ఏలాంటి సంబంధాలు లేవని.    టాప్-స్టోరీ ప్రచురించిన వారిపై కేసులు వేస్తానని ట్రంప్ హెచ్చరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: