బరాక్ ఒబామా తర్వాత అమెరికా అధ్యక్షడు డోనాల్డ్డ్ ట్రంపేనట. డెమెక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమట. ప్రెసిడెంట్ రేసులో హిల్లరీ కంటే ట్రంపే చాలా ముందున్నాడట. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు హిల్లరీ కంటే ట్రంపునే తమ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు ఇష్టపడుతున్నారట.

ఇవన్నీ కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలను పరిశీలిస్తున్న రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా ఎన్నికలపై సర్వే చేసిందట. ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని వారిని ప్రశ్నించింది. దీని ఆధారంగా ఎన్నికల్లో అధ్యక్ష పీఠం ఎవరికి సొంతం కానుందో గణంకాలు ప్రకటించింది.


రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ట్రంప్ 0.2 శాతం హిల్లరీ కంటే ముందున్నాడు. అయితే ప్రస్తుతానికి ట్రంప్ దే పై చేయే అయినా చివరివరకూ ఇదే కొనసాగుతుందని చెప్పలేమనికూడా ఈ సంస్థ చెబుతోంది. ఎందుకంటే 0.2 శాతం గ్యాప్ అంత ఎక్కువేమీ కాదు. ఈ కొద్దిశాతం ప్రజాభిప్రాయం ఎప్పుడైనా మారవచ్చు.

అందుకే ట్రంప్- హిల్లరీ మధ్య పోరు చివరి క్షణాల వరకు ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆర్ సీపీ అభిప్రాయపడింది. ఒక్క ఆర్ సీ పీ మాత్రమే కాదు.. మిగిలిన సర్వే సంస్థలు కూడా ఎక్కువగా ట్రంప్ వైపే మొగ్గుచూపుతున్నాయి. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, రాస్ముస్సెన్, ఫాక్స్ న్యూస్ ట్రంప్ విజయం సాధిస్తాడని ఢంకా భజాయిస్తుంటే... వాల్ స్ట్రీట్ జర్నల్, సీబీఎస్ న్యూస్ మాత్రం హిల్లరీ ముందంజలో ఉందని చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: