తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజించిన తర్వాత ఏపీ అభివృద్ది కోసం కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా ఏపీ ప్రజలకు మరో శుభవార్త..! తిరుపతి ఏర్ పోర్ట్ నుంచి ఇక అంతర్జాతీయ సర్వీసులు మొదలుకాబోతున్నాయ్.  ఇక్కడి నుంచి అమెరికా,దుబాయ్ చుట్టి రావచ్చు.ప్రస్తుతానికి ఈ సర్వీసులను న్యూఢిల్లీ మీదుగా అమెరికా, దుబారు, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు.

దుబాయ్ తోపాటు మిగతా గల్ఫ్ దేశాలకి రాయలసీమ నుంచి రాకపోకలు చాలా ఎక్కువ. వాళ్లంతా ఇప్పటి వరకూ వయా హైద్రాబాద్ వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడిక ఆ అవసరం లేదు. అటు అమెరికా వెళ్లేందుకు ఇక తిరుపతే హెడ్ క్వార్టర్స్ వస్తుందని అంటున్నారు. ఇక ఫ్యూయెల్ ఛార్జీలు పెరిగి, మెయింటెనెన్స్ కష్టం కావడంతో మన దేశంలో కూడా ఏర్ వేస్ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది.  తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ఇంధన, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులశాఖ ముఖ్య కార్యదర్శి అజరుజైన్‌ వెల్లడించారు.

ప్రస్తుతానికి ఈ సర్వీసులను న్యూఢిల్లీ మీదుగా అమెరికా, దుబారు, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. అంతర్జాతీయ సర్వీసులు… సేవల్లోనూ క్వాలిటీ ఏపీవైపు వస్తోంది. విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి లాంటి ఏర్ పోర్ట్ లన్నీ త్వరలోనే మరింత గ్రోత్ చూడబోతున్నాయని ఏపీ లెక్కేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: