కొత్త రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టించాలని ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అందుకు విదేశీ పెట్టుబడులే ప్రధాన మార్గమని ఆయన భావిస్తున్నారు. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ యాత్రలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రాభివృద్ధిలోనూ విదేశీ సాయం తీసుకోవాలనుకుంటున్నారు. 

అందుకే త్వరలోనే పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్ లో రోడ్ షో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జపాన్ యాత్రకు వెళ్లనున్నట్టు చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు. రెండో రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేయాలన్నారు. 

జపాన్ లో చంద్రబాబు పెట్టుబడుల యాత్ర..



పెట్టుబడుల సాధన కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా వదలిపెట్టవద్దని జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలతో 66అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుందని అందులో 42వరకు  కార్యరూపం దాల్చాయని చంద్రాబాబు పేర్కొన్నారు. ఇప్పటివరకూ మొత్తం 5,993కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయని సీఎం పేర్కొన్నారు.

విదేశీ పెట్టుబడుల సాయంతో దాదాపు 10 ఫుడ్ పార్కులు ఏర్పడ్డాయని చంద్రబాబు స్ఫష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తుమ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను రాష్ట్రానికి తీసుకొనిరావాలని సీఎం పరిశ్రమలశాఖకు దిశానిర్ధేశం చేశారు. మౌలిక సదుపాయాలు, సేవలు, ఉత్పత్తి ప్రాజెక్టులు లాంటి ఐదు హబ్ లుగా పర్యాటకం కూడా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: