మీడియా ప్రతినిధులకు సరైన వేతనాలు ఇవ్వని యాజమాన్యాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇటీవల తెలుగులోనూ చాలా మీడియా సంస్థలు జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. ఇప్పటికీ జర్నలిస్టులు ఆయా సంస్థల చుట్టూ తిరుగుతున్న ఉదంతాలు ఉన్నాయి. మరికొన్ని మీడియా సంస్థలు రెండు, మూడు నెలలకు ఓసారి జీతాలు అందిస్తున్నాయి. 

ఐతే.. ఇక మీదట కూడ ఆయా సంస్థలు జీతాలు ఇవ్వక పోతే ఆర్నెల్లు జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది ఢిల్లీ సర్కారు. అదే తప్పు మళ్లీ చేస్తే ఏడాది జైలుతో పాటు..రూ. 10 వేల జరిమానా విధించేలా ఢిల్లీ జర్నలిస్టు యాక్ట్ కు కొత్తగా సవరణలు చేస్తుంది ఆప్ ప్రభుత్వం. పాత్రికేయులకు ఎంత జీతం ఇవ్వాలి. వాస్తవం ఏంటనే వైనం పై తెలుసుకునేందుకు నియమించిన మజిధియా వేజ్ బోర్డు తాజాగా కొన్ని సూచనలు చేసింది.

ఈ రూల్సు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటే మేలు...




దేశ రాజధాని ఢిల్లీలో ఏ మీడియా సంస్థ కూడా సరైన వేతనాలు ఇవ్వడంలేదని ఈ కమిటీ తేల్చింది. అందుకే కచ్చితంగా వేతన సవరణలు జరగాలని...ఇందుకు ఒప్పుకోని యాజమాన్య సంస్థల పై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. 

ఐతే.. ఈ సిఫార్సులు కేవలం ఢిల్లీ ప్రభుత్వానికే మాత్రమే పరిమితం. జర్నలిస్టులును తెగ సతాయించే తెలుగు మీడియా సంస్థలపైనా అలాంటి చర్యలే తీసుకోవాలంటున్నారు తెలుగు మీడియా ప్రతినిధులు. మీడియా చేతిలో ఉంటే ఎలాంటి పనులైనా చేయవచ్చని.. ఎన్నో ఆశలతో పత్రికలు, ఛానళ్లు పెట్టి.. ఆ ఆశలు అడియాశలయ్యాక పెట్టుబడి పెట్టలేక చేతులెత్తేసే మీడియా సంస్థల యాజమాన్యాలు ఎందుకైనా జాగ్రత్తగా ఉంటే మంచిదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: