తిరుపతి లో ప్రతిష్టాత్మకంగా మొదలైన మహానాడు లో ఆవేశపూరితంగా తన స్పీచ్ ని మొదలు పెట్టారు ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాను కూడా ఒక సాధారణ కార్యకర్తనే అని ఆయన అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహాను భావుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ తెలుగు జాతికి పండగ లాంటిది అని చంద్రబాబు ఊటంకించారు. తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే నేతగా ఎన్టీఆర్ ఉంటారు అనీ , ఆయన తరవాత నే ఎవరైనా ఒస్తారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 

 

 తిరుపతి లో ఘనంగా జరుగుతున్న మహానాడు లో బాబు మాట్లాడుతూ కుటుంబం అయినా సొంత వారు అయినా పార్టీ తరవాతనే అని, పార్టీ కంటే ముఖ్యంగా తాను ఎవరికీ కాపు కాయను అని అన్నారు. " పార్టీ జెండా తో పాటు అజెండా ని కూడా మోస్తున్న కార్యకర్తలు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. టీడీపీ కార్యకర్తలు అందరూ చేసుకునే ఏకైక పండగ ఈ మహానాడు. టీడీపీ అంటే నే త్యాగాలకి మారు పేరు ఐన పార్టీ. పేదలు ,బలహీన వర్గాలకీ ముఖ్యంగా మహిళల కి అభ్యున్నతి ఇవ్వడం కోసం టీడీపీ ముప్పై ఐదు సంవత్సరాలు గా కృషి చేస్తోంది. తెలుగు జాతి గుండెల్లో రారాజు గా ఉన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ని మేము ముందు తీసుకుని వెళ్ళడం గర్వంగా ఉంది" అన్నారు చంద్రబాబు.

 

దేశం లో మొట్ట మొదటి సారిగా రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అనీ హైదరాబాద్ ని ప్రపంచ సామాజిక, ఆర్ధిక రంగాలలో నిలబెట్టిన కృషి టీడీపీ కే దక్కుతుంది అన్నారు ఆయన. " ఏపీ ని నెంబర్ వన్ చెయ్యడం కోసం రాత్రీ పగలూ కష్ట పడుతున్నాను, హైదరాబాద్ ని ఉద్యోగాలు కల్పించే నగరం గా తీర్చి దిద్దిన నాకు ఇది పెద్ద కష్టమేమీ కాదు . విభజన తరవాత ఇబ్బందులు ఒస్తాయి అని తెలిసే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాం మనం " అన్నారు బాబు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: