ప్రపంచంలో  ఇప్పటి వరకు అతి పెద్ద యుద్దాలు అయ్యాయి..మొదటి ప్రపంచ యుద్దం, రెండో ప్రపంచ యుద్దం. ఇక రెండో ప్రపంచ యుద్ద సమయానికి కాస్త టెక్నాలజీ పెరగడంతో బాంబు తయారీ వాటితో దాడులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ద సమయంలో అమెరికా నూక్లియర్ బాంబ్ వేయగా అక్కడ లక్ష నలభై వేల మంది మరణించిన ఘటనను జపాన్ దేశం మర్చిపోలేదు. ప్రపంచంలో అత్యంత ఘోరమైన బాంబు దాడి అంటే ఇదే. తాజాగా అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా జపాన్ లోని హిరోషిమా ను సందర్శించారు.

అయితే అమెరికా అధ్యక్షులు ఇప్పటి వరకు ఎవరూ హిరోషిమాను సందర్శించలేదు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన తొలి అద్యక్షుడు గా రికార్డు సృష్టించారు.  హిరోషిమా న్యూక్లియర్ బాంబ్ దాడి ఆదునిక చరిత్రలో ఒక భాగమైందని మాత్రమే ఒబామా వ్యాఖ్యానించారు. హిరోషిమా లో నేలపైకి అడుగిడగానే ఒబామ భూమిని టచ్ చేసి తన గౌరవం తెలియచేశారు.

 రెండో ప్రపంచ యుద్దాన్ని అంతం చేయడానికి ఆనాటి నేతలు అప్పుడు ఉన్న పరిస్థితిలో అణు బాంబు వేయాలని నిర్ణయించారని ఒబామ అంతకుముందు వ్యాఖ్యానించారు. కాగా ఒబామా హిరోషిమా సందర్శనలో జపాన్ ప్రదాని షింజో అబే పా్ల్గొన్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఒబామా రాకను అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: