కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం జరగబోతోంది. కొద్దిరోజులుగా ఊసే లేని నాయకుల వలస మళ్లీ ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా టీడీపీ మంతనాలో మంతనాలు జరిపారట. ఈయన చేరిక కూడా దాదాపుగా కన్ ఫార్మ్ అయిపోయింది. 

కాకపోతే క్రమక్రంగా విషయం వెల్లడించాలని సదరు ఎమ్మెల్యే ప్లాన్ చేసుకున్నారు. అందుకు అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఈ జాయినింగ్ వార్తను లీక్ చేయిస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ మార్పిడిపై తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఆయన దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారట. ఇలా సంప్రదింపులు జరుపుతున్నారంటే.. ఇలాంటి వార్తలను ఖండించడం లేదంటే.. త్వరలో చేరతారనే కదా అర్థం. 

ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కూడా ఖాళీ..




ఐతే.. ఇలా ఏకంగా జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడం జగన్ పార్టీకి నష్టం కలిగించేదే. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చింది. ఐతే.. అశోక్ రెడ్డి మహానాడులో పార్టీలో చేరతారా లేక.. ఆ తర్వాత విజయవాడలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అన్నది తేలలేదు. 

పార్టీ మారిపోవాలన్న అశోక్ రెడ్డి నిర్ణయం గురించి తెలుసుకున్న వైసీపీ కూడా ఆయన్ను తమ జాబితా నుంచి మైండ్ లో పక్కకుపెట్టేసింది. పార్టీ నుంచి వెళ్లిపోయేవాళ్లను బతిమాలే ధోరణి మొదటి నుంచీ వైసీపీలో కనిపించడం లేదు. ఇప్పుడు అశోక్ విషయంలోనూ అదే రిపీటయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లోగా సాధ్యమైనంత మందిని తమ పార్టీలోకి లాగేయాలన్న వ్యూహం టీడీపీలో కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: