తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సంచలనం సృష్టించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మరోసారి ఫస్ట్ ర్యాంక్ కొట్టేశారు. సీఎంగా రెండో ఏడాది పూర్తి చేసుకోబోతున్న కేసీఆర్ కు ఇది నిజంగా మంచి బహుమతే అని చెప్పాలి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు అత్యధిక స్థాయిలో జనామోదం లభిస్తున్నదని మరోసారి రుజువైంది. 

దేశంలోని వివిధ రాష్ర్టాల సీఎంల పనితీరుపై వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ 86శాతం జనామోదం ఉన్నదని సర్వేలో వెల్లడయ్యింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నిలిచారు. ఆయనకు రాష్ట్రంలో 81శాతం మంది మద్దతు ఉన్నదని సర్వేలో తేలింది.

కేసీఆర్ నెంబర్ 1, బాబు నెంబర్ 5..



75 శాతం జనామోదంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మూడో స్థానం సాధించారు. కొత్త రాష్ర్టానికి నూతన రాజధాని నిర్మించే పనిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఫలితాలను వీడీపీ అసోసియేట్స్ తన ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఇక తమ పాలనతో ప్రజల్లో అసంతృప్తి రగిలించిన పాలకులవిషయానికి వస్తే పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లు ఈ వరుసలో ముందున్నారు. 

ఈ ఇద్దరు సీఎంల పనితీరుపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్న విషయం ఈ సర్వేతో వెల్లడయ్యింది. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురులేదన్నది.. ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదన్నది ఇప్పటికే ఎన్నికల ద్వారా రుజువైంది. ఇప్పుడు ఈ సర్వేతో దేశం మొత్తంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎంగా కనిపిస్తున్నారు. గతంలోనూ ఒకసారి కేసీఆర్ బెస్ట్ సీఎం గా గుర్తింపు పొందారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: