మనిషి ఆదిమానవుడి కాలం నుంచి అంచెలంచెలుగా మారుతూ ఇప్పటి నవీన కాలానికి వచ్చాడు. అయితే ఆదిమానవుడిగా ఉన్నప్పుడు తనకు ఒంటిపై బట్టలు వేసుకోవాలన్న విషయం తెలియదు. రాను రాను తన రక్షణకోసం వివిధ వాతావరణాలకు మార్పుగా తన ఒంటిని కాపాడుకోవడానికి ఆకులు,చర్మాలు చివరికి వస్త్రాలు ధరించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనిషి మానం కాపాడే వస్త్రాలపై రోజు రోజుకి విరక్తి పుడుతుందా అనిపించే కొన్ని సంఘటనలు నిజంగా ఆశ్చర్యపరుస్తుంటాయి. నగ్నంగా బిచ్ ల్లో తిరగడం..నగ్నంగా ఆఫీస్ లో పనిచేయడం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఆస్ట్రేలియాలో మదటి నగ్న హోటల్ ఆరంభమైంది.ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో స్టాన్ లీ, ఆంధోని అనే ఇద్దరు రెస్టారెంట్ యజమానులు ఈ నగ్న హోటల్ ను ఆరంభించారు. ఆ రెస్టారెంట్ లో బట్టలు లేకుండా కూర్చుని తమకు కావల్సివాటిని ఆర్డర్ ఇచ్చుకోవచ్చట.

లండన్ లో బునియాడి అనే నగ్న హోటల్ గురించి తెలుసుకున్న తర్వాత వీరికి ఆ తరహా హోటల్ పెట్టాలని ఆలోచన వచ్చిందట.ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హోటల్ కి మంచి ఆదరణ పెరిగిందని యాజమాన్యం చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: