తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ టాప్ ప్రొడ క్షన్ కంపెనీ అయిన డ్రీమ్‌వర్క్ తన వ్యాపార విస్తర ణకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా ఐదోరోజు లాస్ ఏంజిల్స్‌లో పర్యటించిన పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు డ్రీమ్‌వర్క్ ప్రధాన కార్యాలయాన్ని సంద ర్శించారు.


డ్రీమ్‌వర్క్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయి లో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్మ్‌సిటీ అత్యంత అనుకూలంగా ఉంటుం దని కెటిఆర్ అన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో చిన్న తరహా థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. హైదరాబాద్ వచ్చి భారత్ మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాలను పరిశీలించాలని జెఫ్రీని కెటిఆర్ కోరారు.


ఆ తర్వాత లాస్ ఎంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఐ-హబ్ ఇంకుబేటర్‌ను కెటిఆర్ సందర్శించారు. వీటి సంరక్షణతో పాటు మురుగు నీటి శుద్ధిలో వినూత్నమైన పద్దతులను అవలంభిస్తున్న ఐ హబ్ పని తీరు, విజయవంతమైన తీరును కెటిఆర్ తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే టి హబ్ గురించి వివరించి తగిన సహకారం అందించాలని, కలిసి పని చేయాలని కెటిఆర్ కోరారు. ఇందుకోసం ఇంక్యుబేటర్ సిఈవోను హైదరాబాద్‌కు ఆయన ఆహ్వానించారు.

 

సిఇఒ జెఫ్రీ కాట్టన్‌బర్గ్‌ను కలుసుకున్న కెటి ఆర్, ప్రభుత్వ లక్షాలు, విధానాలు గురించి వివరిం చారు. భారత్‌లో విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ, సమర్థనాయకత్వంలో ముందుకు వెళ్తున్న తెలం గాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తమ దీర్ఘ కాలిక ప్రణాళిక అమలులో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కోరుకుంటున్నామన్నారు. అంతేకాకుం డా సినిమాల ప్రమోషన్ కోసం హై ఎండ్ ఎకో సిస్టమ్ తో ఒక థియేటర్‌ను నిర్మిస్తామని, అందుకు సహకరిం చాలని కెటిఆర్‌ను జెఫ్రీ కోరారు. దీనికి స్పందించిన కెటిఆర్ డ్రీమ్‌వర్క్‌కు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: