టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరోసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించిందట. కొంతకాలంగా పార్టీలో ఆయన వ్యవహారం చూస్తుంటే.. రాజ్యసభ ఎన్నికలలో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇస్తారా? ఇవ్వరా అన్న సందేహం వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఆయనకు ఈ సారి  సీటు కష్టమే అనే వాదనే వినిపించింది. 

పార్టీ వ్యవహారాలతో పాటు సుజనా అరెస్టుకు వారంట్ విడుదల కావడం, మారిషస్ బ్యాంకు వ్యవహారం తేలకపోవడం వంటి కారణాలతో ఆయనకు కొనసాగింపు ఉండదని భావించారు. కాని తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, చివరి క్షణంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప సుజనా చౌదరికి రాజ్యసభ సీటు దాదాపుగా ఖాయమైపోయిందట. దీంతో ఆయనకు ఊరట లభించినట్టే. 

ఇంకో చాన్సు దక్కించుకున్న సుజనా.. 


సుజనా వ్యవహారంలాగానే బీజేపీ సీటు కూడా. బీజేపీకి టీడీపీ కోటా నుంచి సీటు ఇవ్వవద్దనే అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ నిర్ణయం మారిందట. ఒక సీటు దాదాపుగా బీజేపీ కోసం కన్ ఫామ్ అయ్యిందట. ఇక మిగిలిన మరో సీటు కోసం ఎన్నో సమీకరణాలు సెట్ చేసుకోవాల్సి వస్తోంది. ప్రముఖంగా పుష్పరాజ్, బీద మస్తాన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. 


సుజనా చౌదవి విషయానికి వస్తే.. కేంద్రమంత్రి పదవి ఇచ్చినా పార్టీ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టిపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు.. మోడీ సర్కారు తాను అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం అని పదే పదే చెప్పుకుంటోంది. అలాంటి కేబినేట్లో మారిషస్ బ్యాంకు వంటి మచ్చ ఉన్న ఒకే ఒక్క మంత్రిగా సుజనా చౌదరి ఉన్నారు. ఆ కారణంగా సుజనాకు కొనసాగింపు ఉండదని భావించినా చివరకు సుజనా పంతమే నెగ్గేలా కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: