ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏపీ ప్రత్యేక ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంటే..మరోవైపు కాపు ఉద్యం తీవ్రస్థాయిలో నడుస్తుంది. విభజన తర్వాత ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని పట్టు వీడని విక్రమార్కుడిలా పోరాడుతున్న మాజీ మంత్రి కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం. అంతే కాదు ఈ విషయంలో ఆ మద్య పెద్ద రగడే కొనసాగింది..రైలు దహనం కూడా జరిగింది.

ముద్రగడకు మద్దతుగా చ


దీంతో ముద్రగడ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేయడం టీడీపీ నేతలు ఆయనను కలిసి హామీపై చంద్రబాబు నాయుడితో ప్రత్యేక చర్చలు కొనసాగిస్తామని చెప్పడంతో నిరాహార దీక్ష మానారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చక పోవడంతో ముద్రగడ పద్మనాభం ఆగష్టు తరువాత నుంచి కాపు రిజర్వేషన్ కోసం తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఇటీవల వరుసగా పలువురు నేతలను కలిసి మద్దతు సమీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శక రత్న దాసరినారాయణరావు తో ఇప్పటికే భేటీ అయ్యారు.

ముద్రగడ దీక్షను విరమింపజేస్తున్న టీడీపీ మంత్రులు


నిన్న  కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ఇంటికి వెళ్లి ఆయన సపోర్టును కూడా అభ్యర్థించారు. తాజాగా జనసేన నేత పవన్ కళ్యాన్ పళ్లంరాజు ఫోన్ చేశారని, ముద్రగడతో మాట్లాడించారని అంటున్నారు. కాపుల భవిష్యత్తు కోసం తను చేపట్టిన ఉద్యమానికి మద్దతునివ్వాలని కాపుల రిజర్వేషన్ కోసం పోరాడాలని ముద్రగడ కోరారని, ఇందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: