మన తెలుగు రాష్ట్రాల రాష్ట్రీయ క్రీడ అయిన కబడ్డీ ఆటతో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాయకులంతా అసెంబ్లీ ఆవరణలో కబడ్డీ ఆడి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ స్పోర్ట్స్‌మీట్‌ను తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, సభాపతి మధుసూదనాచారి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ప్రారంభించారు.


అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌, మధుసూదనాచారి ఉద్యోగులతో కలిసి కబడ్డీ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా ఉద్యోగులకు కుర్చీ ఆటలు నిర్వహించారు. ఈ స్పోర్ట్‌ మీట్‌లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


ఈ సారి తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తెలంగాణ రాష్ట్రం సర్వం సన్నద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ అధికారికంగా సంబరాలను అంబరాన్నంటేలా జరపడానికి సిద్ధమైంది అధికార గణం.


మరింత సమాచారం తెలుసుకోండి: