ఏపీలో జ‌రుగుతున్న నాలుగు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌-ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  సస్పెన్స్ దాదాపుగా తెర దించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వ‌హిస్తూ రాజ్య‌స‌భ స‌భ్యుల పేర్లపై ప‌లు ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ముందుగా పార్టీ నేత‌ల‌తో ఆ త‌రువాత పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల‌తో తిరిగి పార్టీ ముఖ్యుల‌తో చంద్ర‌బాబు స‌మాలోచ‌న‌లు జ‌రిపి తుది గా తన మార్క్ నిర్ణ‌యాల‌కు తెర‌తీశారు. కేంద్ర ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌదరి కి తిరిగి పొడిగింపు ద‌క్కునుంది. ఆయ‌న తో పాటు మ‌రో అభ్య‌ర్ధి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొన‌సాగి ఎన్నిక‌ల స‌మ‌యంలో సైకిలెక్కిన టీజీ వెంకటేష్ పేరును ఒకే చేశారు. తాజాగా వారిద్ద‌రు అసెంబ్లీలో నామినేష‌న్ కూడా దాఖాలు చేశారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణ ప్రాతినిద్యం ద‌క్కుతుంద‌ని భావించినా... చంద్ర‌బాబు మాత్రం తెలంగాణ నాయ‌కుల‌కు ఆ చాన్స్ ఇవ్వ‌లేదు.


ఓటుకు నోటు కేసులో ఇర‌కాటంలో ప‌డకుండా ఉండ‌టానికే సుజ‌నాకు సీటు...


కొద్దికాలం క్రితం టీజీ వెంక‌టేష్ కు రాజ్య స‌భ స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని సీనియ‌ర్ ఎమ్మెల్యే -వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన భూమానాగిరెడ్డి చంద్ర‌బాబుకు విన్న‌వించారు. త‌ద్వారా రాయ‌ల‌సీమ‌కు చెందిన సీనియ‌ర్ నేత‌కు గుర్తింపునిచ్చిన‌ట్లు అవుతుంద‌ని చెప్పారు. టీజీ పేరును ఓకే చేస్తే ప్రాంతీయ సమీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేసినట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. అబ్బే బీజేపీ నుంచి ఎలాంటి ప్ర‌తిపాద‌నా లేదు... మూడు సీట్లూ టీడీపీకే ద‌క్కుతాయి. నాలుగో సీటు గురించి చ‌ర్చిస్తున్నామ‌ని చంద్ర‌బాబును త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆ మ‌ధ్య ప్ర‌క‌టించినా... అది కూడా హైడ్రామాలో భాగ‌మేన‌ని  ఇప్పుడిప్పుడే అంద‌రికీ అర్ధ‌మవుతుంది. మామూలుగా అయితే బీజేపీకి, రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల్సిన  అవ‌సరం లేదుగానీ, చంద్ర‌బాబు ముంద‌స్తు వ్యూహంలో భాగంగానే, బీజేపీకి పిలిచి మ‌రీ ఛాన్సిచ్చారు. సుజ‌నా చౌద‌రి కి  కేంద్ర‌మంత్రి ప‌ద‌వి దూరం కాకూడ‌ద‌నీ, ఓటుకు నోటు కేసులో తాను ఇర‌కాటంలో ప‌డకుండా కాపాడ‌డం అనే ప్రక్రియ నిరంత‌రం కొన‌సాగాల‌నీ... ఇలా చాలా కోరిక‌లు , చంద్ర‌బాబు బీజేపీ ని కోరార‌ట‌. 


రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌పై బాబు ఓ క్లారిటీ ఇచ్చేశారు...

ఆ కోరిక‌ల్ని మ‌న్నించిన బీజేపీ, చంద్ర‌బాబుకి అభ‌య హ‌స్తం కూడా అందించింది. ఇంకోప‌క్క, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం  వ‌హించ‌నున్నారు. రాజ్య‌స‌భ కోటాలో. ఇక‌నేం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి రైల్వే శాఖ పరంగా ఏదో మేలు జ‌రిగిపోతుంద‌న్న ప్ర‌చారానికి చంద్ర‌బాబు తెరలేప‌నున్నార‌న్న‌ది నిర్వివాదాంశం. ఎటూ, రైల్వే జోన్ కి కేంద్రం అనుకూలంగా ఉంది కాబ‌ట్టి, ఆ ఒక్క‌టీ ఇచ్చేసి... సురేష్ ప్ర‌భు, ఆయ‌న‌తో పాటు బీజేపీ అధినాయ‌క‌త్వం, ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు కాల‌ర్ ఎగరేసినా ఆశ్చ‌ర్చ‌పోన‌క్క‌ర్లేదు. మొత్త‌మ్మీద‌, అనేక ట్విస్టుల నడుమ‌, చంద్ర‌బాబు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌పై దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేశార‌న్న‌మాట. అయినా... ఇంత హైడ్రామా అవ‌స‌ర‌మా?  మేం ఉన్నాం... మా ప్రాణాలు సైతం లెక్క చెయ్యం... రాష్ట్రాన్ని విడ‌పోనివ్వం... మీరేమీ ఆందోళ‌న  చెంద‌వ‌ద్దు.. మా ప‌దవులు పోయినా లెక్క చేయం ప‌ద‌వుల్ని వ‌దిలేసుకుంటే రాష్ట్ర విభ‌జ‌న ఆగిపోదు. ప‌దవుల్లో ఉండ‌డం ద్వారా నే అధిష్టానాన్ని ప్ర‌శ్నించ‌గ‌లం... కేంద్రం పై ఒత్తిడి తీసుకురాగ‌లం.. అని ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రం విభ‌జ‌న సమ‌యంలో మంత్రిగా ప‌నిచేసిన టీజీ వెంక‌టేష్ చేసిన వ్యాఖ్య‌లివి.


టీజీ, సుజ‌నా ఇద్ద‌రూ ఇద్ద‌రే...!

ప్ర‌త్యేక హోదా సాధించి తీర‌తాం.. ప్ర‌త్యేక హోదా కన్నా మించి  కేంద్రం  ఇస్తామంటోంది. కాద‌న‌లేం క‌దా... ప్ర‌త్యేక హోదా వ‌చ్చే అవ‌కాశం లేదు. ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌న్న న‌మ్మ‌కం ఉంది.  సంక్రాంతి త‌రువాత ప్ర‌త్యేక హోదా పై క్లారిటీ వ‌స్తుంది. బీహార్ ఎన్నిక‌ల త‌రువాత స్ప‌ష్ట‌త ఇస్తుంది కేంద్రం.. 5 రాష్ట్రాల ఎన్నిక‌లున్నాయి క‌దా, అందుకే ఆల‌స్యం... ప్ర‌త్యేక హోదా రాదు, ప్యాకేజీ తో స‌రిపెట్టుకోవాలి. ఆ ప్యాకేజీ పై చ‌ల్ల‌ని క‌బురు త్వ‌ర‌లో వ‌స్తుంది. ప్ర‌త్యేక హోదా పై కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి మాట‌కు మాట‌కు పొంత‌న లేకుండా చేసిన వ్యాఖ్య‌లివి. అటు టీజీ వెంక‌టేష్ .. ఇటు సుజనా చౌద‌రి ఇద్ద‌రూ ఇద్ద‌రే... ఒక‌రేమో, మంత్రి ప‌ద‌వి కోసం రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల్ని  తాక‌ట్టు పెట్టిన  ఘ‌నుడు ఇంకొకాయ‌న‌, పేరుకి పొలిటీషియ‌న్... అంతే త‌ప్ప‌, ఆయ‌న ఏనాడూ ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్ళిన దాఖ‌లాల్లేవు.
టీడీపీ కి ఆర్థికంగా అండ‌దంలందించినందుకు గాను, రాజ్య‌స‌భ సీటు  ద‌క్కించుకుని, కేంద్ర‌మంత్రి అయిపోయారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఈసారి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం భ‌లే అభ్య‌ర్థుల్ని త‌యారు చేశారు, ఒక‌రు ఎక్కువ‌, ఒకరు త‌క్కువ ఆలోచిస్తే కాస్తో కూస్తో టీజీ వెంక‌టేష్ బెట‌ర్.


స‌మ‌ర్ధించుకోవ‌డానికి బాబుకి భ‌లే కార‌ణాలు దొరికాయి..

టీజీ వెంక‌టేష్ ప్ర‌జా క్షేత్రం నిలుచున్నారు. కొస్తో కూస్తో.. రాయ‌ల‌సీమ హ‌క్కుల కోసం పోరాడారు. ఆఫ్ కోర్స్... మంత్రి ప‌ద‌వి కోసం అవ‌న్నీ  అట‌కెక్కించేశార‌నుకోండీ , అది వేరే విష‌యం. చిత్ర‌మైన విష‌యమేమిటంటే.. సుజ‌నా చౌద‌రి, ఆంద్ర‌ప్ర‌దేశ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డిపోతున్నార‌ట‌. విభ‌జన స‌మ‌యంలో పార్ల‌మెంట్ లో ఉండి సుజ‌నా చౌద‌రి చాలా పోరాటం చేశార‌ని, అందుకే మ‌రో మారు రాజ్య‌స‌భ కు వెళ్ళే  అవ‌కాశం కలిపిస్తున్నామ‌ని చంద్ర‌బాబు సెలవిచ్చారు. టీజీ వెంక‌టేష్ కి రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న ఉంది కాబ‌ట్టి, ఆయ‌నకు రాజ్య‌స‌భ సీటిచ్చామ‌న్న‌ది చంద్ర‌బాబు వాద‌న‌. స‌మ‌ర్థించుకోడానికి చంద్ర‌బాబుకి భ‌లే కార‌ణాలు దొరికాయి.  న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టుగా ఉంది రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో  చంద్ర‌బాబు  తీరు. 11 కేసుల్లో  ఏ1గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ , ఏ2 గా ఉన్న విజ‌య సాయిరెడ్డి ని రాజ్య‌స‌భ  కు పంపడమేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించేశారు. మ‌రి, మారిష‌న్ బ్యాంకుని మోసం చేసిన కేసులో, సుజ‌నా చౌద‌రి ఎదుర్కొంటున్న ఆరోప‌ణ‌ల మాటేమిటి? 


ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు సంగతేంటీ?


ఓట‌కు నోటు కేసులో బ్రీఫింగ్ ఆరోప‌ణ‌ల  వ‌చ్చి న చంద్ర‌బాబు సంగతేంటీ?  సుజ‌నా చౌద‌రి , టీజీ వెంక‌టేష్ ... ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌లే కానీ, చంద్ర‌బాబుకి వారిద్ద‌రూ ఇప్పుడు  వ్యాపార‌వేత్త‌ల్లా కానీ, చంద్ర‌బాబుకి వారిద్ద‌రూ ఇప్పుడు వ్యాపార‌వేత్త‌ల్లా క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్ అండ్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ లా క‌నిపిస్తున్నారు. అంతే, చంద్ర‌బాబు నంది అంటే అది పంది అయినా స‌రే, నంది అని ఒప్పుకోవాల్సిందే. లేక‌పోతే ఆయ‌న‌కు కోప‌మొచ్చేస్తుంది. మొత్తం మీద రాజ్య స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న మార్క్ ను  చూపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: