ఈ మద్య భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఓ వైపు మహిళలు గగ్గోలు పెడుతుంటే..ఏకంగా మహిళా కలెక్టర్ ని ఓ ప్రజా ప్రతినిధి కామంతో కళ్లు మూసుకు పోయి సెక్పీ కూతలు కూసి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సర్‌గుజాలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్జీత్‌ భగత్ పాల్గొన్నారు. అయితే అది ప్రజాసంబంధింత ర్యాలీ కనుక అందరూ మనోడు ప్రజల గురించి వారి బాగోగుల మాట్లాడుతారని ఆశించారు.

కానీ సందు ఎమ్మెల్యే అది మరిచిపోయి పక్కనే ఉన్న ఎమ్మెల్యే అందం గురించి పొగిడాడు..అంతే కాదు తన సెక్సీ మాటలతో సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి.. ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అన్నారు.  ఇది చాలదూ అన్నట్లు మరో ప్రజా ప్రతినిధిని కించ పరిచి మాట్లాడుతూ.. తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్‌లాంటి పిచ్చివాడిని చూడలేదని చెప్పి అందరకి షాక్ నిచ్చారు.

సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భగత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో స్పందించిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సదురు ఎమ్మెల్యేపై రోడ్డుపై ట్రాఫిక్‌ను అడ్డగించడం, కలెక్టర్, మంత్రులపై అసభ్యపదజాలం వాడినందుకు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: