ఓ దొంగ గత  వారం రోజుల నుంచి హైదరాబాద్ పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేశాడు..ఇంతకీ ఆయగారు చేసిన దొంగతనం ఏంటా అనుకుంటున్నారా..! డబ్బూ..నగలు కాదు చిన్నా చితకా పని కూడా కాదు..ఏకంగా కేంద్ర మంత్రి సెల్ ఫోన్ కే టెండర్ పట్టాడు. అదును చూసి మంత్రిగారి సెల్ ఫోన్ నొక్కేశాడు..దీంతో అంతటి కేంద్ర మంత్రి ఇంట్లో దొంగతనం జరింగిదన మీడియాకు తెలియగానే అదికాస్తా సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. అప్పటి నుండి ఆ సెల్ ఫోన్ ట్రేస్ ఔట్ చేస్తూ దొంగ వెంట పడుతున్నారుపోలీసులు.

మొత్తానికి బండారు దత్తాత్రేయ సెల్ఫోన్ ను చోరీ చేసిన ఘనుడుని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన గుమ్మడి రాజ్‌కుమార్(52) శ్రీశైలంలో దర్శనం పాస్‌ల కోసం ఈనెల 15 వతేదీ రామ్‌నగర్‌లోని దత్తాత్రేయ ఇంటి వెళ్లాడు. అప్పటికే హైదరాబాద్ లో విపరీతమైన గాలి దుమారం చెలరేగడంతో చెట్టు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  దాంతో దత్తాత్రేయ సెల్ఫోన్ ను చార్జింగ్ కోసం ఆయన ఇంటి ముందు ఉన్న ఓ గదిలో పెట్టారు.

ఇక ఆ రోజు దత్తన్న ఇంట్లో సందర్శకులు తాకిడి విపరీతంగా ఉంది..ఇక ఇదే మంచి సమయం అనుకున్న రాజ్ కుమార్ చిన్నగా సెల్ ను  చోరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించపోవడంతో మంత్రి పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు సెల్ ఫోన్ కోసం ట్రేసింగ్ చేయగా ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: