గత నెలలో తమిళనాడులో ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన అసెంబ్లీ ఎలక్షన్లలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్యంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అంతే కాదు ఆమె వరుసగా రెండోసారి సీఎం కావడం కూడా రికార్డే..గతంలో అన్నాడీఎంకే అధినేత ఎంజీఆర్ కి మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు ఈ సారి జయలలిత సొంతం చేసుకుంది. తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి వెళ్లిన జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మోడీకి అందజేశారు.

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందించాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్రానికి పార్లమెంటులో అన్నాడీఎంకే మద్దతు, తమిళనాడుకు ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.తమిళనాడు ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక జయలలిత, ప్రధాని మోడీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.నేపథ్యంలో జయలలితను కూటమిలో చేరాలని మోడీ స్వయంగా ఆహ్వానించవచ్చని, అందుకు ఆమె సైతం నిరాకరించే అవకాశాలు తక్కువేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉభయ సభల్లో మొత్తం 50 మందికి వరకు సభ్యులున్నారు. వీరంతా కూడా ఎన్టీఏకు మద్దతు తెలిపితే ఉభయ సభల్లో బిల్లులు ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని బీజేపీ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: