తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన చిరకాల ప్రత్యర్థి వృద్ధనాయకుడు కరుణానిధిపై మళ్లీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌లలో ఎవరు తమ అధినేత అనే విషయంపై ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొందంటూ అసెంబ్లీలోనే సెటైర్లు పేల్చారు. కరుణానిధి ముందు శాశనసభకు వచ్చి తనకు సమాధానం చెప్పాలంటూ ఘాటుగా కామెంట్లు చేశారు.జయలలిత కామెంట్లు తమిళనాడు అసెంబ్లీలో గందరగోళానికి దారి తీశాయి.


డీఎంకే సభ్యులు నిరసన తెలిపారు. దీంతో మరోసారి ఫైర్ అయిన పురచ్చి తలైవి.. తన విమర్శలపై సమాధానం ఇచ్చే దమ్ము,ధైర్యం కరుణానిధికి లేవంటూ మరోసారి రెచ్చిపోయారు.  తమిళనాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు జయలలిత సమాధానమిచ్చిన సమయంలో ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. దమ్ముంటే డీఎంకే ఎమ్మెల్యేలు కరుణానిధిని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ చేశారు. డీఎంకేలో తండ్రీ కొడుకుల మధ్య గ్రూపు రాజకీయాలున్నాయని జయలలిత విమర్శించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: