అమరావతి నిర్మాణం ఏమో గానీ తాత్కాలిక సచివాలయం పూర్తి చేసే విషయం లో ఏపీ ప్రభుత్వం ఇంకా ముందుకు కదలడం లేదు. భవన నిర్మాణ పనులు ఇంకా కనీసం ఒక కొలిక్కి కూడా రాలేదు. సచివాలయ నిర్మాణం పూర్తి చేసి అందులో ఈ నెల 27 నుంచీ ఏపీ కి చెందిన ప్రతీ కార్య కలాపాన్నీ సాగించాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. అయితే పనుల ప్రారంభం నుంచే ఎదో ఒక ఆటంకం వారికి ఎదురు అవ్వగా నిర్మాణాలలో కూడా జాప్యం చోటు చేసుకుంటూ వస్తోంది.

 

కనీసం రెండు మూడు నెలలు గడిస్తే కానీ తుది రూపం కూడా కనపడని పరిస్థితి. ఈ విషయం స్వయంగా ఇంజినీర్ లే చెబ్తున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడి దగ్గర సుమారు 45 ఎకరాల్లో ఆరొందల కోట్లు ఖర్చు పెట్టి ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఈ సచివాలయం పనులు మొదలు పెట్టింది. సచివాలయం యొక్క ప్రధాన భవనాన్ని నిర్మించడం, ఆ దగ్గరలో రహదారులూ , విద్యుత్తు, తాగు నీరు , అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ 27 కి పూర్తి కావాల్సి ఉంది అయితే కనీసం భావన నిర్మాణం కూడా తుదిరూపానికి రాకపోవడం తో ఇది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు అని చూసినవారు అంటున్నారు.

 అలాగని కంగారు కంగారు గా నిర్మాణం చేపడితే భవిష్యత్తు లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అనీ భవిష్యత్తు లో భవనాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది అనీ అంటున్నారు నిపుణులు, ఇంజినీర్ లు కూడా కంగారు పెడితే మాత్రం భవిష్యత్తు లో భవన నిర్మాణ క్వాలిటీ కి తాము భరోసా కాదు అని తేల్చి చెప్పెయ్యడం తో ఏమీ చెయ్యలేని ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది.

 

50% పూర్తయింది

 

దాదాపు ఆరు బ్లాక్ లని విడివిడిగా విభజించారు. అందులో మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి కి స్పెషల్ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తారు దాని పక్కనే సీఎస్ , సాధారణ పరిపాలన విభాగం , న్యాయ శాఖ ఉంటాయి. ఇప్పట్లో ఆరు బ్లాకులు పూర్తి కావు కాబట్టి కనీసం మొదటిది అయినా అందించాలి అని ప్రభుత్వం కోరుతోంది. అయితే మొదటి బ్లాకు కూడా 27 కి పూర్తి అవ్వడం ఎట్టి పరిస్థితి లో జరిగేదిగా కనపడ్డం లేదు. మొత్తం బిల్డింగ్ మీద ఇప్పటి వరకూ యాభై శాతం మాత్రమే పూర్తి అయ్యింది. కనీసం నాలుగైదు నెలలు ఖచ్చితంగా పట్టేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: