తెలంగాణ ఏర్పడ్డాక అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ అద్భుతాలే జరుగుతాయని కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే ఇష్టానుసారంగా విద్యుత్, బస్సు చార్జీలు పెంచడమేనా అని ఆయన ప్రశ్నించారు. 

బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమేనా!


తండ్రి, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రోజుకో అంకె పెంచుతూ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందని చెబుతున్నారన్నారు. రెండేళ్ల పాలన విజయోత్సవాలు,పూర్తి కాని సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి రూ.300 కోట్లు ఖర్చు చేయటానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయన్నారు. ‘సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన చార్జీలు భారమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి’ అని కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.  



బస్సుచార్జీల పెంపు వల్ల పేద ప్రయాణికులపై, విద్యుత్ చార్జీల పెంపుతో అన్నివర్గాల ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. చార్జీల పెంపు ఉండదని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసిందని, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, బాధల తెలంగాణను చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరెంటు, బస్సు చార్జీలను పెంచడం బాధాకరమని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: