కాంగ్రెస్ ని తెలంగాణా లో తిరిగి బలోపేతం చెయ్యడం కొసం ఆ పార్టీ నేత జానా రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారిలో ధైర్యం చెప్పే పనిలో బిజీ గా ఉన్నారు ఆయన. వరస పెట్టి వారం నుంచీ విరివిగా సమావేశాలు నిర్వహిస్తున్న జానా రెడ్డి చాన్నాళ్ళ తరవాత తన మనసులో మాటని బయట పెట్టేసారు . తాను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్న ఆకాంక్ష ని నెమ్మదిగా చెప్పిన ఆయన ఇన్నాళ్ళ తరవాత నిజం ఒప్పుకున్నట్టు అయ్యింది.

 

తాజాగా నాగార్జున సాగర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో ఎవరెవరు పార్టీ నుంచి వెళ్ళారు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలు బేరీజు వేసుకున్నారు. " నా స్థాయి లో నేను ఉన్నప్పుడు నేను ఎవ్వరినీ తిట్టలేను, దూశించానూ లేను. పార్టీ లో ఉన్న సమానమైన మనిషినని అర్ధం చేసుకోవాలి. తెలంగాణా కి సమానత్వ హక్కు ఇచ్చిందీ , స్వాతంత్రం తెచ్చి పెట్టిందీ , తెలంగాణా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నే కాబట్టి 2019 లో కాంగ్రెస్ కి అధికారం దక్కి తీరుతుంది.

 

 

ఆ సమయం లో నా బుజస్కందాల మీద పార్టీ ని మోసుకుని వెళతాను. కాబోయే ముఖ్యమంత్రి ని కూడా నేనే అవుతాను " అని ఆయన వ్యాఖ్యలు చెయ్యడం తీవ్ర కలకలం రేపుతోంది.  కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్ లో జరిగిన ఒక మీటింగ్ లో ఇలాంటి వ్యాఖ్యలే చేసారు జానా. ఉపాధ్యాయుల మీద కోపం ప్రదర్శిస్తూ తెలంగాణా వస్తే ముఖ్యమంత్రి అయ్యేది తానే అని చెప్పారు జానా. ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన మాట్లాడ్డం తో కేంద్రం నుంచీ జిల్లాల వరకూ కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అని చెప్పచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: