చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణ బాధ్యతను సింగపూర్ సంస్థలకు అప్పగించారు. దీని కోసం స్విస్ ఛాలెంజ్ అనే విధానాన్ని అమలుపరిచారు. సింగపూర్ సంస్థలకు దాదాపు 1600 ఎకరాలు కట్టబెడుతున్నారు. చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. 

అయితే ఈ నిర్ణయంపై ప్రశ్నిస్తే చాలు.. చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పార్టీలపైనే కాదు.. చివరకు జర్నలిస్టులపై కూడా చంద్రబాబు ఫైర్ అవుతున్నారని కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడుతున్నారు. మీడియా ప్రశ్నించినా, ప్రతిపక్షం ప్రశ్నించినా వారిపై ఎదురుదాడి చేస్తున్నారని అంటున్నారు. 


అమరావతి నిర్మాణంపై చంద్రబాబును ప్రశ్నించిన ఒక మీడియా ప్రతినిధిని..  నీవు కడతావా అని అడిగారని, అలా కట్టగలిగి ఉంటే ఆ విలేఖరి మీడియా ప్రతినిదిగా ఎందుకు ఉంటారని సీఆర్ అన్నారు. రాజధాని నిర్మాణం వంటి కీలకమైన నిర్ణయాల విషయంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వెళ్తున్నారని సీ రామచంద్రయ్య విమర్శిస్తున్నారు. 

చంద్రబాబు విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని.. స్విస్ ఛాలెంజ్ వంటి కీలక నిర్ణయాలపైనా ఎవరితోనూ చర్చించడం లేదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్, స్విస్ ఛాలెంజ్ వంటి నిర్ణయాలను చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ ను పిలిచి మాట్లాడాలని రామచంద్రయ్య సూచించారు. సీఆర్ సూచన బాగానే ఉంది.. కానీ చంద్రబాబు జగన్ ను పిలిచి మాట్లాడటమా.. అది జరిగేపనేనా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: