రాజధాని హైదారాబాద్ వదిలి కొత్త రాజధాని వైపు ఏపీ ఉద్యోగుల అడుగులు ఇప్పుడిప్పుడే మొదలు అయ్యాయి. మొదటి నుంచీ మేము రామూ వచ్చే సమస్యే లేదు అంటూ సతాయించిన వీరు ఇప్పుడు తమకి బాగా అలవాటు అయిన మహానగరాన్ని వదిలి గుంటూరు చేరుకున్నారు. ఒక దశ లో గొంతెమ్మ కోర్కెలు తెరమీదకి తీసుకురావడం , ప్రభుత్వానికి దెబ్బకి బీపీ రావడం జరిగిన విషయాలే.

 

 వీరి తీరు మీద ఏపీ లో భారీ వ్యతిరేకత ఎదురు అవ్వగా హైదరాబద్ విడిచి వెళ్ళలేని వారు ఎట్టకేలకి అంతా సర్దుకుని ఏపీ రాజధానికి బయలుదేరారు పాపం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మెతక మనిషి కాకపోవడం వారితో ఖరాఖండి గా రావాల్సిందే అని చెప్పడం తో హైదరాబాద్ లోని వివిధ కార్యాలయాల నుంచి ఏపీ వైపు వస్తున్నారు ఉద్యోగులు. భావోద్వేగ బంధం హైదరాబాద్ తో తెంచుకుని బాధతో ఏపీ వచ్చిన ఏపీ ఉద్యోగులకి ఊహించని రీతి లో ఘన స్వాగతం లభించింది. ఎన్నో సంవత్సరాల తరవాత సొంత ప్రాంతం వచ్చిన వారికి స్థానికులు పూలు జల్లి మరీ స్వాగతం ఏర్పాటు చేసారు.

 

హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని తరలి వస్తున్న శాఖలు రోజు రోజుకూ పెరుగుతూ వస్తుండగా గడిచిన మూడు రోజులలో  దాదాపు గా 20 శాఖలు ఏపీ రాజధానికి తరలి వచ్చాయి. ఒక్క శనివారం ప్రాంతం లోనే పది శాఖల కార్యాలయాలు గుంటూరు - విజయవాడలలో మొదలు అయ్యాయి. వచ్చిన ప్రతీ ఉద్యోగి కీ ఘనంగా స్వాగతం పలుకుతూ ఉండడం తో ఉద్యోగులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: